Ktr: కాంగ్రెస్ లో డబ్బులిస్తేనే పదవులు.. వచ్చే ఎన్నికల్లో పత్తా ఉండదు.. మాదెప్పుడు ఒంటరి పోరే.. చిట్ చాట్ లో కేటీఆర్ సంచలన కామెంట్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్(Ktr), రాష్ట్రాన్ని వెనక్కి నెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

ktr sensational comments on revanth reddy and congress in chit chat

  • రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు
  • కాంగ్రెస్ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు
  • బీఆర్ఎస్ కార్యాచరణపై కీలక ప్రకటనలు

Ktr: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన చిట్‌చాట్‌లో రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, హైదరాబాద్ అభివృద్ధి, మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం, పార్టీ భవిష్యత్ కార్యాచరణ వంటి అనేక అంశాలపై విస్తృతంగా స్పందించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్(Ktr), రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం కంటే వెనక్కి నెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని, ఉన్న నగరాన్ని పట్టించుకోకుండా ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో ప్రచారం చేసుకోవడానికే పరిమితమవుతోందని విమర్శించారు.

Telecom Tower: దెబ్బ అదుర్స్ కదా.. బిల్ కట్టలేదని ఏకంగా టవర్నే లేపేశారు.. టెక్నీషియన్ వచ్చి చూస్తే షాక్..

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశాన్ని ప్రస్తావిస్తూ, అది సరైన నిర్ణయం కాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, రాష్ట్ర కాంగ్రెస్ నుంచే సమాచారం వెళ్లిందని మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అయితే ఈ అంశం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని, బీఆర్ఎస్‌కు సంబంధం లేదని చెప్పారు. అలాగే కాంగ్రెస్‌లో పదవులు డబ్బులతో వస్తాయని, పార్టీ ప్రస్తుతం జారుడు బండపై ప్రయాణిస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమవుతుందని, ప్రధాన పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందని జోస్యం చెప్పారు.

పార్టీ సంస్థాగత బలోపేతంపై కూడా కేటీఆర్ కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 60కి పైగా నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ సమావేశాలు పూర్తయ్యాయని తెలిపారు. సభ్యత్వ నమోదు యాప్ తుది దశలో ఉందని, త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. సభ్యత్వ నమోదు అనంతరం పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే నిరుద్యోగుల సమస్యలపై సరూర్‌నగర్‌లో భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేసిన కేటీఆర్, పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు భవిష్యత్‌లో బస్సు యాత్ర చేపట్టే అవకాశం ఉందని, దాని సమయాన్ని కేసీఆరే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. దీంతో, ప్రస్తుతం కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.