Lok Sabha Secretariat not recognise TRS as BRS
Lok Sabha Secretariat: భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీకి లోక్సభ సచివాలయం షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్కు బీఆర్ఎస్ అనే గుర్తింపు ఇంకా ఇవ్వలేదని తాజాగా లోక్సభ సచివాలయం పేర్కొంది. అంతే కాకుండా లోకసభ బీఏసీ నుంచి టిఆర్ఎస్ తొలగించినట్లూ కూడా వెల్లడించారు. లోకసభలో ఆరుగురు, అంతకంటే ఎక్కువ సభ్యులు ఉన్నట్లైతే బీఏసీలో సభ్యత్వం ఉంటుంది. టిఆర్ఎస్ తరపున ఇప్పటి వరకు బీఏసీ సభ్యుడిగా లోకసభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఉన్నారు. అయితే తాజాగా బీఏసీ నుంచి టీఆర్ఎస్ను తొలగించడంతో నేడు జరిగే బీఏసీకి నామా నాగేశ్వరరావును కేవలం ఆహ్వానితుడిగానే హాజరు కానున్నారు. టీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది మంది సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీకి సభ్యుడిగా కాకుండా కేవలం ఆహ్వానితుడిగా నామా నాగేశ్వరరావుని తీసుకున్నారు. ఇక నేటి బీఏసీ సమావేశంలో మంత్రిత్వ శాఖల వారీగా డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ మీద తీసుకోవాల్సిన విధానాలపై చర్చించనున్నారు.