యాహూ.. స్కూల్ పిల్లలకి, పేరెంట్స్‌కి గుడ్‌న్యూస్‌.. వరుసగా సెలవులు.. ఫుల్ డీటెయిల్స్‌..

ఈ లాంగ్ వీకెండ్‌ను ఇంట్లో రిలాక్స్‌ కావడానికి, ఒత్తిడి లేకుండా చదువుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.

స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. త్వరలోనే స్కూళ్లకు వరుసగా సెలవులు వస్తున్నాయి. పరీక్షల వేళ పిల్లలు ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమయంలో వారికి వరుసగా హాలీ డేస్‌ వస్తున్నాయి. ఈ సమయంలో వారు దాదాపు ఐదు రోజుల పాటు రిలాక్స్‌ అవుతూనే ఇంటి వద్దే చదువుకోవచ్చు.

ఫిబ్రవరి నెలలో మరోసారి వరుస సెలవులు ఉండే అవకాశముంది. ఈ నెల 26, 27వ తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: వారెవ్వా.. ఛాంపియన్స్‌ ట్రోఫీలో తొలి శతకం.. కివీస్‌ ఓపెనర్‌ విల్‌యంగ్‌ అద్భుతం..

ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా సెలవు ఉంది. అదే విధంగా, 27వ తేదీన రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుండటంతో సెలవు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

పోలింగ్ రోజు సెలవును ప్రకటించే అధికారం ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ ఆదేశాలు జారీ చేశారు.  అదనంగా, శుక్రవారం 28న ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే, మీకు మరో రెండు రోజుల శని, ఆదివారాలు కలిసి వస్తాయి.

ఈ లాంగ్ వీకెండ్‌ను ఇంట్లో రిలాక్స్‌ కావడానికి, ఒత్తిడి లేకుండా చదువుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. పరీక్షల వేళ పిల్లలు పలు రకాల వ్యాయామాలు చేస్తే మరింత ఉత్సాహంగా చదువులో రాణించవచ్చు.