PAK vs NZ: వారెవ్వా.. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి శతకం.. కివీస్ ఓపెనర్ విల్‌యంగ్ అద్భుతం..
టాస్ నెగ్గిన పాకిస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచులోనే కివీస్ ఓపెనర్ విల్‌యంగ్ సెంచరీ బాదాడు. న్యూజిలాండ్- పాకిస్థాన్ మధ్య తొలిరోజు మ్యాచ్ జరిగింది. టాస్ నెగ్గిన పాకిస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.
107 బంతుల్లో విల్‌యంగ్ ఒక సిక్సు, 11 ఫోర్ల సాయంతో శతకం బాదాడు. అతడికి టామ్ లేథమ్ చక్కని సహకారం అందించాడు. కివీస్ ఓపెనర్ విల్‌యంగ్ మొదటి నుంచి మెరుపులు మెరిపించాడు. అతడు సెంచరీ చేసిన సమయానికి డెవెన్ కాన్వే 10, కానె విలియమ్సన్ 1, డరిల్ మిచెల్ 10, టామ్ లేథమ్ 45 (నాటౌట్) పరుగులు చేశారు.
విల్‌యంగ్ శతకం బాదే సమయానికి న్యూజిలాండ్ స్కోరు 175/3 (35 ఓవర్లు)గా ఉంది. పాకిస్థాన్ బౌలర్లలో నసీం షా, అబ్రర్ అహ్మద్, హ్యారీ రౌఫ్‌కు తలో వికెట్ దక్కాయి.
న్యూజిలాండ్ టీమ్: డేవన్ కాన్వే, విల్‌యంగ్, కేన్, డారిల్, టామ్ లేథమ్,బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియమ్ రౌర్కీ
పాకిస్థాన్ టీమ్: జమాన్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, రిజ్వాన్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
BCCI: భారత క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ వేళ..