BCCI: భారత క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ వేళ..
టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

PC:BCCI
భారత క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. బీసీసీఐ నిబంధనల వల్ల భారత క్రికెటర్ల భార్యలు, వారి కుటుంబ సభ్యులు వారితో ఉండేందుకు అనుమతి ఉండదని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
భారత క్రికెటర్లు విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు ఈ షరతులు వర్తిస్తాయని ప్రచారం జరిగింది. అయితే, ఈ విషయంలో బీసీసీఐ వెనక్కి తగ్గింది. భారత క్రికెటర్ల వెంట కుటుంబ సభ్యుల్ని అనుమతించేందుకు ఒప్పుకుంది.
క్రికెటర్ల వెంట వారి భార్యలతో పాటు భాగస్వాములు, ఫ్యామిలీ మెంబర్స్ ఉండేందుకు బీసీసీఐ పలు నిబంధనలతో అనుమతించినట్లు తెలుస్తోంది. అది కూడా ఒక్క మ్యాచ్‌కే. క్రికెటర్లు ఏదైనా ఒక మ్యాచుకు తమ కుటుంబ సభ్యులను తెచ్చుకుంటే అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తామని టీమ్ మేనేజ్‌మెంట్‌కు బీసీసీఐ తెలిపింది.
బీసీసీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బీసీసీఐ నిబంధనల మేరకు భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లోనూ తప్పనిసరిగా పాల్గొంటున్నారు. బీసీసీఐ నిబంధనల వల్ల క్రికెటర్లు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లే వీలు లేదని ప్రచారం జరిగింది. ఇప్పటికే టీమిండియా దుబాయ్ చేరుకుంది.
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్, టీమ్ సభ్యులు అందరూ దుబాయ్‌కు చేరుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టారు. భారత్ రన్నరప్‌గా ఛాంపియన్స్ టోఫ్రీలో బరిలోకి దిగుతోంది. భారత జట్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కావడం అభిమానులను నిరాశ పర్చింది. అతడి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణా జట్టులోకి వచ్చాడు.