ICC ODI Rankings: అదరగొట్టిన శుభ్‌మన్ గిల్.. వన్డేల్లో నంబర్‌వన్ బ్యాటర్.. టాప్-10లో ఉన్న మనోళ్లు వీరే..
ఇవాళ బాబర్ 13 పాయింట్లు కోల్పోయాడు. శుభ్‌మన్ 15 పాయింట్లు పొందాడు.

Shubman Gill
ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న బాబర్ అజంను శుభ్‌మన్ గిల్ వెనక్కి నెట్టాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మూడో వన్డేలో శుభ్‌మన్ గిల్ 102 బంతుల్లో 112 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా 142 పరుగుల తేడాతో ఆ మ్యాచులో గెలుపొందింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు వన్డే బ్యాటర్ల జాబితాలో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. ఇంగ్లాండ్‌పై 3 మ్యాచ్‌ల సిరీస్ భాగంగా శుభ్‌మన్ గిల్ ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. 86.33 సగటుతో మొత్తం 259 పరుగులు బాదాడు.
Also Read: నువ్వు నా కాలు విరగ్గొట్టడానికి ప్రయత్నించావు..! బౌలర్‌తో రోహిత్ శర్మ.. వీడియో వైరల్
శుభ్‌మన్ గిల్ గత వారం బాబర్ అజం కన్నా కేవలం 5 పాయింట్లు వెనకబడి ఉన్నాడు. ఇవాళ బాబర్ 13 పాయింట్లు కోల్పోయాడు. శుభ్‌మన్ 15 పాయింట్లు పొందాడు.
శుభ్‌మన్ గిల్ ఖాతాలో ఇప్పుడు మొత్తం 796 పాయింట్లు ఉండగా, బాబర్‌కి 776 పాయింట్లు ఉన్నాయి. వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో మొత్తం నాలుగు భారత బ్యాటర్లు ఉన్నాయి. శుభ్‌మన్ గిల్ తరువాత రోహిత్ శర్మ (3), విరాట్ కోహ్లీ (6) శ్రేయాస్ అయ్యర్ (9) ఉన్నారు.
నిన్నటి వరకు బాబర్ అజంకు 786 పాయింట్లు ఉండేవి. అలాగే, శుభ్‌మన్ గిల్‌కు 781 పాయింట్లు ఉండేవి. అలాగే, రోహిత్ శర్మ 773 పాయింట్లతో మూడో స్థానంలో ఉండేవాడు. ఇప్పుడు కూడా అతడి మూడో స్థానం చెక్కుచెదరలేదు.
టాప్-10 బ్యాటర్స్