ఆదిలాబాద్ జిల్లాలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం, భయాందోళనకు గురైన ప్రయాణికులు.. వీడియో వైరల్

బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. రెప్పపాటులో ఘోర ప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.

Lorry Rtc Bus Incident : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. రెప్పపాటులో లారీ, ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన నుంచి బయటపడ్డాయి. నేరడిగొండ మండలం బందం వద్ద రోడ్డు క్రాస్ చేసేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయత్నించారు. అదే సమయంలో అటువైపు నుంచి వేగంగా లారీ దూసుకొచ్చింది. లారీ డ్రైవర్ చాకచక్యంగా లారీని కంట్రోల్ చేశాడు. అయినప్పటికీ బస్సు వెనకాల లైట్ గా లారీ ఢీకొట్టింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. రెప్పపాటులో ఘోర ప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అటు వైపు నుంచి లారీ చాలా వేగంగా వచ్చింది. ఇంతలో రోడ్డు క్రాస్ చేసేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. పొరపాటున బస్సు ముందు భాగాన్ని లారీ కనుక ఢీకొట్టి ఉంటే.. చాలా ఘోరం జరిగిపోయి ఉండేది. బస్సులోని అనేక మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడేవి. అయితే, లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. లారీని కంట్రోల్ చేస్తూ పక్కకి తిప్పాడు. దాంతో ఘోర ప్రమాదం తప్పినట్లు అయ్యింది.

ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముందు నుంచి ఓ లారీ అతి వేగంగా వస్తున్నా.. బస్సు డ్రైవర్ పట్టించుకోలేదు. రోడ్డుని క్రాస్ చేసేయాలి అనే తొందరతో బస్సుని అలాగే ముందుకు పోనిచ్చాడు. అయితే, ప్రమాదాన్ని గుర్తించిన లారీ డ్రైవర్ బస్సుని తప్పిస్తూ లారీని పక్కకి తిప్పాడు. దాంతో ఘోర ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. బస్సులో ఉన్న 30మంది ప్రయాణికులు సేఫ్ గా ఉన్నారు. దాంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. లారీ డ్రైవర్ కనుక చాకచక్యంగా వ్యవహరించకపోయి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏది ఏమైనా రోడ్డు క్రాస్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందు వెనుక చూసుకుని డ్రైవింగ్ చేయాలి. రోడ్డుని క్రాస్ చేసే సమయంలో కేర్ ఫుల్ గా ఉండాలి. అంతా ఓకే, ఎలాంటి ప్రమాదం లేదని అనుకున్నప్పుడే ముందుకు వెళ్లాలి. అలా కాదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

Also Read : బెంగళూరులో షాకింగ్ ఘటన.. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళపై లైంగిక దాడి, వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని..

ట్రెండింగ్ వార్తలు