Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్!
తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు వర్షాలు(Rain Alert) కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
- V Santhosh Kumar
- Published on- October 21, 2026 / 06:34 PM IST
Low pressure in bay of bengal heavy rain alert for andhra pradesh and telangana
Rain Alert: నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీరప్రాంతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఒక అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరోవైపు థాయిలాండ్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించి, పశ్చిమ-వాయువ్య దిశగా పయనించనుంది. దీని ప్రభావంతో అక్టోబర్ 23 నాటికి ఆగ్నేయ, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో మరో నూతన అల్పపీడనం ఏర్పడి, తదుపరి మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు తెలిపాయి.
Saudi Strict Rules: ఏడాదిలో 100 మందికి పైగా మరణశిక్ష.. సౌదీలో కఠిన చట్టాలు.. తెలుసుకోకపోతే ప్రమాదమే!
ఏపీ, రాయలసీమల్లో వర్షాలు.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు:
ఈ వాతావరణ మార్పుల ఫలితంగా రాబోయే మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు(Rain Alert) లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రచండమైన మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తెలంగాణ వాతావరణ సమాచారం.. ఈరోజు ఈదురుగాలులతో వర్షాలు:
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. అయితే రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, క్రమంగా వర్ష తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
