Gadwal Vijayalakshmi: గద్వాల్ విజయలక్ష్మి సోదరి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..
Gadwal Vijayalakshmi: తన సోదరి కనిపించడం లేదని గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మీ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Harish Thanniru
- Updated on- June 15, 2026 / 12:12 PM IST
Gadwal Vijayalakshmi Sister Missing Case
Gadwal Vijayalakshmi: తన సోదరి కనిపించడం లేదని గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మీ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరుగా మహిళా కమిషన్ చైర్మన్ ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ చేసిన పోలీసులు.. అదృశ్యమైన మహిళ కోసం గాలింపు చేపట్టారు. అయితే, కేసు నమోదు చేసిన తర్వాత అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యమైంది. తాను ఎక్కడికి పోలేదు అంటూ పోలీసులకు మహిళ వివరించింది.
Also Read – తెలంగాణలోని కుటుంబాలకు డబుల్ షాక్.. నూనెల ధరలు పెరిగాయ్.. అల్లాడిస్తోన్న టమాటా, అల్లం.. దేశంలో తెలంగాణ టాప్‌ల్లో భారీ మార్పులు..
గద్వాల విజయలక్ష్మి దూరపు బంధువు నమ్రత (54). విజయలక్ష్మీ ఇంట్లోనే నివాసం ఉంటుంది. అయితే, ఆమె కనిపించకపోవటంతో.. తన ఇంట్లో ఉంటున్న నమ్రత కనిపించట్లేదు అంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో విజయలక్ష్మి పేర్కొంది. ఈనెల 4వ తేదీన ఉదయం 10గంటలకు ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగిరాలేదని తెలిపింది.
ఫిర్యాదులో సతీష్(35), సత్యనారాయణ(45), కుమారి(45) అనే ముగ్గురు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు విజయలక్ష్మి పేర్కొంది. దీంతో గద్వాల విజయలక్ష్మీ ఇంట్లో మహిళ మిస్సింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే, తాను ఎక్కడికి పోలేదని నమత్ర పోలీసులకు తెలిపినట్లు తెలిసింది.
