Mallu Ravi : లిల్లీపుట్ మాటలు మానుకో.. మాజీ సీఎం కేసీఆర్‌కు మల్లు రవి స్ట్రాంగ్ కౌంటర్
నీ అహంకారం వల్ల, నీ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం దివాళా తీసిందని మాజీ సీఎం కేసీఆర్ పై మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Harishth Thanniru
- Published On : April 17, 2024 / 11:43 AM IST
Mallu Ravi
Mallu Ravi Comment To KCR : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను మల్లు రవి ఖండించారు. కేసీఆర్ నీది లిల్లీపుట్ మనస్తత్వం కాబట్టే నీకు అధికారం పోయింది. త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి ఆకాశమంత గొప్ప మనసున్న మనిషి కాబట్టే ప్రజలు నిన్ను అధికారంలో నుంచి దించేసి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని మల్లు రవి అన్నారు.
Also Read : యాదగిరి గుట్టను కూడా మేమే కట్టాం.. మరి అక్కడికెందుకు వెళ్తున్నారు?: కేసీఆర్
నీ అహంకారం వల్ల, నీ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం దివాళా తీసిందని మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరు నాయకులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే నీ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చింది. నువ్వు వెనక్కు తిరిగి చూస్తే ఇప్పుడు ఎవరు లేరు. ఇంకాకూడా నీ అహంకారపు మాటలతో నీ పార్టీలోఉన్నవారు కూడా ఊడ్చుకుపోయేటట్లు చేసుకుంటున్నావు అంటూ మల్లు రవి హెచ్చరించారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని నీ బిడ్డను జైల్లో నుంచి బయటకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నావని తెలంగాణ ప్రజలకు తెలుసు. లిల్లీపుట్ మాటలు మానుకో.. ప్రజలకు ఎలాంటి మేలు చేయాలో ఆలోచించి మాట్లాడు. కనీసం మీ పార్టీ ఉనికి అయినా ఉంటుంది అంటూ మల్లు రవి మాజీ సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు.
