యాదగిరి గుట్టను కూడా మేమే కట్టాం.. మరి అక్కడికెందుకు వెళ్తున్నారు?: కేసీఆర్

KCR: మరి సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నారని ప్రశ్నించారు.

యాదగిరి గుట్టను కూడా మేమే కట్టాం.. మరి అక్కడికెందుకు వెళ్తున్నారు?: కేసీఆర్

KCR

అంబేద్కర్ విగ్రహాన్ని తాను పెట్టిననందుకు అక్కడ అంబేద్కర్ జయంతి రోజున అలంకరణలు చేయలేదని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆ మహానీయుడిని గౌరించుకోవాలని హైదరాబాద్‌లో 125 అడుగుల విగ్రహం పెట్టామని, కాంగ్రెస్ మాత్రం అవమానించిందని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

సచివాలయాన్ని కూడా తామే కట్టామని, అంబేద్కర్ పేరు పెట్టామని చెప్పారు. మరి సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నారని ప్రశ్నించారు. యాదగిరి గుట్టను కూడా తామే కట్టామని.. మరి అక్కడికెందుకు వెళ్తున్నారని కేసీఆర్ నిలదీశారు. అంబేద్కర్ పుణ్యం వల్ల మనకు తెలంగాణ వచ్చిందని తెలిపారు.

ప్రభుత్వం మెడలు వంచుదామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారిని ఓడిస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు. నోరు మూసుకుని పడి ఉందామా? సురుకు పెడదామా? అని అన్నారు. ప్రజల దీవెనలతోనే ఢిల్లీలో పోరాడామని చెప్పారు.

ఇప్పుడే తెలంగాణకు బీఆర్ఎస్ ఎంపీలు అవసరమని కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి మెదక్ లో భారీ మెజార్టీ ఇచ్చారని చెప్పారు. తాము పదేళ్లు కష్టపడి అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు.

Also Read: దత్తపుత్రుడు అప్పుడేమో భార్యలను మార్చారు.. ఇప్పుడేమో వీటిని మార్చుతున్నారు: జగన్