దత్తపుత్రుడు అప్పుడేమో భార్యలను మార్చారు.. ఇప్పుడేమో వీటిని మార్చుతున్నారు: జగన్

YS Jagan: రొయ్యకు మీసం, బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయని సీఎం జగన్ అన్నారు.

దత్తపుత్రుడు అప్పుడేమో భార్యలను మార్చారు.. ఇప్పుడేమో వీటిని మార్చుతున్నారు: జగన్

YS Jagan

నాలుగైదేళ్లకొకసారి కార్లను మార్చేసినట్లుగా దత్తపుత్రుడు భార్యలను మార్చుతారని, ఇప్పుడు నియోజకవర్గాలనూ అలవోకగా మార్చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. భీమవరంలో వైసీపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడారు.

మొదట పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించి భార్యలను వదిలేశారని జగన్ చెప్పారు. మహిళల జీవితాలను నాశనం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని అడిగితే దత్తపుత్రుడికి బీపీ వస్తుందని, ఊగిపోతున్నాడని చెప్పారు. మోసాలు, పొత్తులపై నమ్మకం ఉంచి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

తనకు వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయ్యాయని జగన్ చెప్పారు. అందరూ కలిసి తనపై బాణాలు ఎక్కుపెట్టారని విమర్శించారు. ఆ బాణాలు ఎవరికి తగులుతాయని ప్రశ్నించారు. జగన్‌కా లేక సంక్షేమ పథకాలకా అని నిలదీశారు. చంద్రబాబు తనకు శాపనార్థాలు పెడుతున్నారని చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చే ఒక్క పథకమూ లేదని అన్నారు.

వెన్నుపోటు రాజకీయాలు చేస్తారని చెప్పారు. చంద్రబాబుకు ఓట్లు వేస్తే సంక్షేమ పథకాలన్నీ ఉండబోవని అన్నారు. తాను పేదలపక్షమని చెప్పారు. వైసీపీకి ఓటు వేస్తే మంచి కొనసాగుతుందని తెలిపారు. రొయ్యకు మీసం, బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయని సీఎం జగన్ అన్నారు.

Also Read: ఎన్నికల వేళ సీఎం జగన్‌పై సినీ హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు