Vishal: ఎన్నికల వేళ సీఎం జగన్‌పై సినీ హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు

గతంలో కూడా జగన్ పై కోడి కత్తితో దాడి చేశారని విశాల్ అన్నారు. ఇలాంటి దాడులకు..

Vishal: ఎన్నికల వేళ సీఎం జగన్‌పై సినీ హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు

Vishal

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ సీఎం జగన్‌పై సినీ హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 10 టీవీతో ఇవాళ హీరో విశాల్ మాట్లాడుతూ.. ఏపీలో మళ్లీ సీఎం అయ్యేది వైఎస్ జగనే అని చెప్పారు. ఆయనపై జరిగిన దాడిలో కుట్ర కోణం ఉందని అన్నారు.

కావాలనే జగన్ పై దాడి చేశారని తెలిపారు. గతంలో కూడా జగన్ పై కోడి కత్తితో దాడి చేశారని విశాల్ అన్నారు. ఇలాంటి దాడులకు జగన్ భయపడరని విశాల్ చెప్పారు.

జగన్ ప్రచార సభల్లో మార్పు
 ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ సీఎం జగన్ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. జగన్ బస్సు యాత్రలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజవర్గం తేతలిలో ఇవాళ రాత్రికి బస చేయనున్నారు జగన్. షెడ్యూల్ ప్రకారం ఇవాళ రాత్రికి తూర్పు గోదావరి జిల్లా ఈతకోటకు బస్సు యాత్ర చేరుకోవాల్సి ఉంది.

అయితే, భీమవరం సభ అనంతరం గరగపర్రు, పిప్పర దువ్వ మీదగా రోడ్ షోగా తణుకు నియోజకవర్గం తేతలి చేరుకోనుంది బస్సు యాత్ర. జాతీయ రహదారిని అనుకుని ఉన్న ప్రాంతంలో తేతలిలో సభ ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇటీవల జగన్ పై రాయితో దాడి జరిగిన నేపథ్యంలో సభ జరిగే ప్రాంతంలో పటిష్ఠంగా తనిఖీలు చేస్తూ బందోబస్తుపై నిమగ్నమయ్యారు పోలీసులు.

Also Read: త్వరలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టబోతుంది: ఎర్రబెల్లి దయాకర్ రావు