Extramarital Affair : నాతో అక్రమ సంబంధం కొనసాగించాల్సిందే.. యువకుడికి మహిళ బెదిరింపులు.. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య

Extramarital Affair : వివాహిత మహిళతో పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని ముగించాలని తీసుకున్న నిర్ణయం చివరకు ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది.

Extramarital Affair

  • వ్యక్తి ప్రాణంతీసిన వివాహేతర సబంధం
  • వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన
  • మహిళ వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆరోపణలు

Extramarital Affair : వివాహిత మహిళతో పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని ముగించాలని తీసుకున్న నిర్ణయం చివరకు ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. నాతో అక్రమ సంబంధాన్ని కొనసాగించకుంటే నీ పరువు తీస్తానంటూ మహిళ బెదిరించడంతోనే ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : Pawan Kalyan : తీవ్ర విషాదం.. పవన్ వీరాభిమాని నిరంజన్ మృతి.. ఇటీవలే కలిసిన పవన్..

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం కోకట్ గ్రామానికి చెందిన గాండ్ల శివకుమార్ (31)కు వివాహం జరిగింది. అయితే, అదే గ్రామానికి చెందిన మరో వివాహిత మహిళతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయంకాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, కొన్నిరోజుల తరువాత శివకుమార్ ఆ మహిళతో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని సదరు మహిళకు సైతం చెప్పాడు. ఇకనుంచి మన మధ్య వివాహేతర సంబంధానికి కొనసాగించొద్దని తెలిపాడు. కానీ, అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.

తనతో అక్రమ సంబంధం కొనసాగించాల్సిందేనని, లేదంటే నీ పరువు తీస్తానంటూ ఆ యువకుడిని మహిళ బెదిరించింది. నువ్వు నన్ను వదిలేయడం ఏంటి..? నాతో ఎఫైర్ కంటిన్యూ చేయాల్సిందేనంటూ శివకుమార్‌పై ఒత్తిడి చేసింది. లేదంటూ నీ పరువుతీస్తా.. పంచాయితీ పెట్టిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడింది. రోజురోజుకు మహిళ నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ వ్యవహారం కాస్తా ఊరి పెద్దల వరకు వెళ్లింది. పెద్ద మనుషులు ఇద్దరినీ పిలిచి గట్టిగానే మందలించారు. ఎవరి దారి వారు చూసుకోండి.. గొడవలు వద్దని హెచ్చరించారు. అయినా సరే.. ఆవిడ తీరు మారలేదు. పంచాయితీ తర్వాత మరింత రెచ్చిపోయిన ఆమె.. శివకుమార్‌కు ఫోన్ చేసి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది.

నాతో వివాహేతర సంబంధం కంటిన్యూ చేయకపోతే.. నీ పరువు బజారుకు ఈడుస్తానంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగింది. ఒకవైపు సమాజానికి భయం.. ఇంకోవైపు ఆమె చేస్తున్న ఫోన్ కాల్స్ వేధింపులు తట్టుకోలేకపోయిన శివకుమార్ తన ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. మహిళ వేధింపులు, బెదిరింపుల వల్లే శివకుమార్ చనిపోయాడంటూ అతని భార్య, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.