కూలీ పనులకెళ్లిన వివాహిత హత్య… ఫామ్‌హౌస్‌లో విగతజీవిగా కనిపించిన మహిళ
- bheemraj
- Published On : February 27, 2021 / 08:02 AM IST
Married man brutally murdered : వికారాబాద్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఓ వివాహిత హత్య గావించబడింది. జిల్లాలోని అవుసుపల్లికి చెందిన వివాహిత అమృతమ్మ కూలీ పనులకని చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. కంగారుపడిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
ఈలోపే ఓ ఫామ్ హౌస్‌లో ఆమె శవమై కనిపించింది. వికారాబాద్ సమీపంలోని ఆలంపల్లి నుంచి గిరిగేట్‌పల్లి వెళ్లే దారిలో రైలు పట్టాల పక్కన మహిళ శవం కనిపించిందన్న సమాచారంతో.. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహం కనిపించకుండా పోయిన వివాహితదిగా గుర్తించారు. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
