Rain Alert : తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు వర్షాలు.. భీకర గాలులు.. రెడ్ అలర్ట్ జారీ.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

Rain Alert : తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Heavy rains for three days in several districts of Telangana

  • తెలంగాణ ప్రజలకు రెయిన్ అలర్ట్
  • మూడ్రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు
  • 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు

Rain Alert : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండల తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాబోయే రాబోయే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ తెలంగాణతోపాటు దానిని ఆనుకుని ఉన్న తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read : Telangana Govt : TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల.. 24 పోస్టులు.. లక్షకుపైగా జీతం.. అర్హతలు ఇవే..

ఇప్పటికే కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో రెండుమూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయని.. ఈనెల 15వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. ప్రస్తుతం మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని, వర్షం కురిసే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

శనివారం తెలంగాణలోని అదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ – మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

భారీ వర్షాలకుతోడు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ తీగలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.