Rain Alert : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నైరుతి రుతుపవనాలపై కీలక అప్డేట్.. ఈ జిల్లాల్లో వర్షాలు.. భారీగా ఈదురుగాలులు..

Rain Alert : వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల రాకకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రుతుపవనాలు ఇప్పటికే బంగాళాఖాతం వైపు వేగంగా విస్తరిస్తున్నాయి. రుతుపవనాల కదలికల ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడవిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Telangana Rain

  • తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్
  • నైరుతి రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు
  • ఈరోజు, రేపు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
  • ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మూడ్రోజులు వడగాలులు

Rain Alert : తెలంగాణలో ఎండలు తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎండ తీవ్రతతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నా ఎండల వేడిమి నుంచి ఉపశమనం లభిచండం లేదు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాకకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని, త్వరలోనే తెలంగాణలోకి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయని తెలిపింది.

Also Read : IND vs AFG Series Squad : రోహిత్, విరాట్‌లకు ఛాన్స్.. బుమ్రా, పంత్‌తోపాటు వారికి షాక్.. అఫ్గాన్‌తో టెస్టు, వన్డేలకు జట్ల ఎంపిక.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..

వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల రాకకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రుతుపవనాలు ఇప్పటికే బంగాళాఖాతం వైపు వేగంగా విస్తరిస్తున్నాయి. రుతుపవనాల కదలికల ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు పడే సమయంలో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రుతుపవనాలు వేగంగా కదులుతుండటంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 26 నాటికి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉండగా.. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో వచ్చే వారం రోజులపాటు రాష్ట్రంలోని అత్యధిక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారీగా ఈదురుగాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అయితే, వారంరోజుల తరువాత పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఎండల తీవ్రత తగ్గుముఖం పడుతుందని తెలిపింది. ప్రస్తుతం రెండు మూడు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్‌ల వద్ద ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. అయితే, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం మూడు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.