Jupally Krishna Rao: కాన్వాయ్ ఆపేసి.. ప్రాణాన్ని కాపాడి.. మానవత్వం చాటుకున్న మంత్రి జూపల్లి

ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే అసలైన నాయకత్వ లక్షణమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) మరోసారి నిరూపించారు.

Minister jupally krishna rao stops convoy to save accident victim in nagarkurnool

  • మంత్రి జూపల్లి కాన్వాయ్ నిలిపివేత
  • ప్రమాద బాధితుడికి తక్షణ సహాయం
  • మానవత్వం చాటుకున్న రాష్ట్ర మంత్రి

Jupally Krishna Rao: ప్రజాప్రతినిధులు అంటే కేవలం అధికార హోదా, నిబంధనలు మాత్రమే కాదు.. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే అసలైన నాయకత్వ లక్షణమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి నిరూపించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని చూసి, తన పర్యటనను సైతం పక్కనబెట్టి సకాలంలో స్పందించారు. అధికార హోదాను పక్కనపెట్టి, అత్యవసర సమయంలో ఒక సాధారణ మనిషిగా ఆయన చూపిన చొరవ స్థానికులను, నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.

Robot Teacher: సర్కారీ బడిలో ‘రోబో టీచర్’.. విద్యార్థులకు ‘Ai’ పాఠాలు.. ప్రభుత్వ పాఠశాలలో హైటెక్ విప్లవం

ప్రమాద బాధితుడికి అండ – కాన్వాయ్ వాహనంలోనే ఆస్పత్రికి:

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం సమీపంలో నార్లాపూర్ గ్రామానికి చెందిన కావలి మల్లేష్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో రోడ్డుపై పడి ఉండగా, అదే మార్గంలో వెళ్తున్న మంత్రి జూపల్లి(Jupally Krishna Rao) వెంటనే తన కాన్వాయ్‌ను ఆపారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఏమాత్రం సమయం వృథా చేయకుండా, తన భద్రతా కాన్వాయ్‌లోని ఒక వాహనంలోనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించాలని సిబ్బందిని ఆదేశించి వెంటనే వైద్య సహాయం అందేలా చేశారు.

వైద్యులకు ఆదేశాలు – వెల్లువెత్తుతున్న ప్రశంసలు:

బాధితుడికి అత్యవసర విభాగాన మెరుగైన వైద్యం అందించాలని, పరిస్థితిపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని మంత్రి వైద్యులను, అధికారులను పురమాయించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాలను కాపాడే కీలకమైన ‘గోల్డెన్ అవర్’లో మంత్రి జూపల్లి సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే ఆ వ్యక్తి ప్రాణాలు నిలిచాయని వైద్యులు, స్థానికులు కొనియాడారు. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా, ఒక మంచి మనసున్న వ్యక్తిగా మంత్రి చూపిన ఈ మానవతా దృక్పథంపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.