×
Ad

Minister KTR Tweet : ‘జేపీ నడ్డా చెప్పులు ఎవరు మోస్తారో ? అంటూ ’కేటీఆర్ స్టైల్ సెటైర్

బండి సంజయ్ పాదయాత్ర పూర్తి చేసుకుని ఈరోజు వరంగంల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు మరో బీజేపీ అగ్రనేత..బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో మరోసారి ట్వీట్ చేశారు. "ఈరోజు జేపీ నడ్డా చెప్పులు మోసే గులాం ఎవరు..? దీనికి తీవ్రమైన పోటీ ఉంటుందని కచ్చితంగా అనుకుంటున్నాను" అంటూ ఒక నవ్వు సింబల్‌తో సెటైరికల్ ట్వీట్ చేశారు.

  • Published On : August 27, 2022 / 01:50 PM IST

Minister KTR Tweet Satire tweet  ON BJP leaders

Minister KTR Tweet Satire tweet  ON BJP leaders : మునుగోడు ఉప ఎన్నిక జరుగనున్న క్రమంలో కాషాయ అగ్రనేతలు ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ గల్లీల్లో తిరుగుతున్నారు. ఆలయాలను సందర్శించుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీ వచ్చారు.ఈ పర్యటనలో షా ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత బండి సంజయ్ చెప్పులు తీసి కాళ్ళ ముందు పెట్టారు. ఈ వీడియోపై టీఆర్ఎస్ నేతలు ఓ ఆటాడుకున్నారు బీజేపీని. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ అయితే తనదైన శైలిలో ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని – తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది. అంటూ ట్విట్టర్ లో సెటైర్లు వేశారు.

ఇదిలా ఉంటే బండి సంజయ్ పాదయాత్ర పూర్తి చేసుకుని ఈరోజు వరంగంల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు మరో బీజేపీ అగ్రనేత..బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో మరోసారి ట్వీట్ చేశారు. “పాప్ క్విజ్.. ఈరోజు జేపీ నడ్డా చెప్పులు మోసే గులాం ఎవరు..? దీనికి తీవ్రమైన పోటీ ఉంటుందని కచ్చితంగా అనుకుంటున్నాను” అంటూ ఒక నవ్వు సింబల్‌తో సెటైరికల్ ట్వీట్ చేశారు.

కాగా..ఈరోజు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ వేదికగా బీజేపీ భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ భారీ సభకు ప్లాన్ చేసింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దాంతో నడ్డా రాక సందర్భంగా.. ఇవాళ జేపీ నడ్డా చెప్పులు మోసే గులాం ఎవరంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు.