Ponguleti Srinivas Reddy
Ponguleti Srinivas Reddy: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. తాను సీఎం రేసులో లేనని, తాను సామాన్య కార్యకర్తనని అన్నారు. ఖమ్మంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
“మంత్రిని కాబట్టి అధికారులు అనేక పనుల కోసం నన్ను కలుస్తారు. చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడితే ఏమి చేయగలం? ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరూ గగ్గోలు పెట్టింది నిజమే కదా? ఫోన్ ట్యాపింగ్ సామగ్రి తోటల్లో, ఫాంహౌసుల్లో పెట్టుకుని ఇంకా వింటున్నారు. ప్రభుత్వం చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటుంది.
Also Read: Lok Sabha: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం
త్వరలో జిల్లాల మార్పులపై ఒక కమిటీ వేసి రిపోర్ట్ తీసుకుని మార్పులు చేర్పులు చేస్తాం. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా చేసింది. ఏ ఎన్నికల్లో అయినా ఇచ్చిన మాట నెరవేర్చడం వల్లనే ప్రజలు గెలిపించారు.
కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు జీర్ణించుకోలేక గడిచిన వారం రోజులుగా కొందరు నిజ స్వరూపాన్ని వెళ్లగక్కుతున్నారు. ప్రతిపక్ష నేతలు అని చెప్పుకునే వారి భాష, సంస్కృతి సమాజం సిగ్గుపడేలా ఉంది. గ్రామ పంచాయతీల్లో ఎలా తీర్పు వచ్చిందో అలానే మున్సిపల్లో అదే తీర్పు వస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలు కాంగ్రెస్ రిఫరెండం అని మేము చెప్పలేదు.
కేటీఆర్ రెండు సార్లు నోరు జారారు. మున్సిపల్ ఫలితాలు తేడాగా వస్తాయని సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ పేదల పక్షపాతిగా ఉంది. పార్టీలకు అతీతంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాము. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని విధంగా విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం” అని తెలిపారు.