education-minister-sabitha-indra-reddy
Minister Sabitha: కూరగాయలు అమ్ముతూ కనబడిన చిన్నారిని చదువుకోవాలని భవిష్యత్ బాగుంటుందంటూ ధైర్యం చెప్పారు విద్యాశాఖ మంత్రి పీ. సబితా ఇంద్రారెడ్డి. తుక్కుగూడ మునిసిపాలిటీలో ఉన్న బాలుడి తండ్రిని పిలిపించి స్కూల్ కు రెగ్యూలర్ గా పంపించాలని సూచించారు.
తుక్కుగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా తరచూ అక్కడి ప్రజలను కలుస్తున్నారు.
సోమవారం చిన్నారిని ఇంద్రారెడ్డి కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భవిష్యత్ ను కాపాడుకోవాలంటే విద్య ఒకటే పెట్టుబడి అని చదువు విలువ పిల్లలకు చాటిచెప్పారు మంత్రి సబితా.
Read Also: నీ కనులను చూశానే.. సిద్దు పాడిన పాట రిలీజ్!