నేను లోకల్- ఐపీఎస్ రంగనాథ్ వర్సెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్

అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Mla Danam Nagender Warning : ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ ఏవీ రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లు ఉందన్నారు. అందుకే తనపై కేసులు పెట్టారని మండిపడ్డారు. అధికారులు వస్తుంటారు, పోతుంటారు.. నేను లోకల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు దానం. నందగిరి హిల్స్ హుడా లేఔట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని తెలిసి తాను అక్కడికి వెళ్లానని దానం చెప్పారు. అక్కడ జరిగిన విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించడం తన బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.

నందగిరి హిల్స్ ఘటనపై అధికారులకు ప్రివిలేజేషన్ నోటీసులు ఇస్తానని దానం నాగేందర్ చెప్పారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. గతంలోనూ తనపై కేసులు పెట్టారని, ఇప్పటి కేసులు తనకు కొత్తేమీ కాదన్నారు. పేదల కోసం ఎన్ని కేసులైనా భరిస్తానన్నారు.

అంతకుముందు నంది హిల్స్ ఘటనలో ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 69లో ప్రభుత్వ స్థలంలో ప్రహరీని ఈ నెల 10న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో గురుబ్రహ్మ నగర్ కి చెందిన గోపాల్ నాయక్, రాంచందర్ నాయక్ తదితరులు కూల్చివేత ఘటనలో ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రహరీ కూల్చివేతతో రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదు చేశారు. ఈ కేసులో దానం నాగేందర్ ను ఏ-3గా పోలీసులు చేర్చారు.

Also Read : ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోలేదా? లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన అడిషనల్ కలెక్టర్

ట్రెండింగ్ వార్తలు