Mla Anirudh Reddy: ఏదో ఒకరోజు సీఎం అవుతా..!- 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ లో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చు. ముఖ్యమంత్రి కావాలని అందరికీ ఉంటుంది. అవినీతి రహిత రాష్ట్రం చేయాలని నాకుంది.

  • Published On : April 5, 2026 / 08:40 PM IST

 

Mla Anirudh Reddy: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో కాంగ్రెస్ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ పలు అంశాలపై మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సి తీరు, ముఖ్యమంత్రి పదవిపై అనిరుధ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

”అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఇష్యూస్ పైన, పబ్లిక్ రిక్వైర్ మెంట్స్ పైనే ఎక్కువగా మాట్లాడాలి. నువ్వు వస్తే నేను వస్తా, నువ్వు కొడితే నేను కొడతా అని మాట్లాడితే రాను రాను నమ్మకమే పోతుంది. కాంగ్రెస్ లో అంతా చదువుకున్న వాళ్లే. డాక్టర్లు ఇంజినీర్లే. మా సైడ్ వాళ్లు ఎవరూ కూడా ఒక్క బూతు మాట్లాడరు. మా డాక్టర్లు అంతా బాగా సహనం ఉన్న డాక్టర్లు ఉన్నారు. మా నోటి నుంచి ఒక్క బూతు కూడా రాదు.

పొల్యూషన్ ఫ్రీ నియోజకవర్గం చేస్తానని నేను హామీ ఇచ్చాను. ఫస్ట్ టైమ్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తాను. రెండోసారి చెప్తాను. మూడోసారి తిరగబడతాను. పొల్యూషన్ బోర్డు అధికారులు స్పందించలేదు. అసెంబ్లీ అయిపోయాక చెత్త తీసుకెళ్లి ఆయా ఫ్యాక్టరీల ముందు వేస్తాను.

జడ్చర్ల ప్రజలకు చెప్పాను. ఇంకా రెండు మూడు సార్లు గెలిపించాలని కోరాను. కాంగ్రెస్ లో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చు. ముఖ్యమంత్రి కావాలని అందరికీ ఉంటుంది. అవినీతి రహిత రాష్ట్రం చేయాలని నాకుంది. అవినీతి లేకుండా రాష్ట్రాన్ని నడిపించాలని ఉంది. నిజాయితీగా పని చేయాలని ఉంది. రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ గా చేయాలని ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా చాన్స్ వస్తుంది. రేవంత్ రెడ్డి నెక్ట్స్ 8 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత కూడా ఆయన ఉండొచ్చు. అదంతా పబ్లిక్ డిసైడ్ చేస్తుంది. ఎవరు ఏంటి అనేది జనాలు నిర్ణయిస్తారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. ఇది పక్కా” అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు.