Indiramma Illu: 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు.. కేవలం రూ.5 లక్షలతోనే.. లబ్ధిదారులకు ప్రభుత్వ బంపర్ ఆఫర్!

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో రూ.5 లక్షల బడ్జెట్‌లో కేవలం 20 రోజుల్లోనే నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని(Indiramma Illu) చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు.

Model indiramma house inaugurated in rangareddy built in 20 days at 5 lakh cost

Indiramma Illu: తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగం సహాయం అందుకుంటున్న లబ్ధిదారులకు తక్కువ ఖర్చుతో, వినూత్న రీతిలో వేగవంతంగా ఇళ్ల (Indiramma Illu)నిర్మాణం పూర్తి చేసి అందించేందుకు ఒక మోడల్ ఇంటిని అందుబాటులోకి తెచ్చారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో రూ.5 లక్షల బడ్జెట్‌లో కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే నిర్మించిన ఈ ఆధునిక మోడల్ ఇందిరమ్మ ఇంటిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ఘనంగా ప్రారంభించారు.

JC Prabhakar Reddy: వైఎస్ఆర్ పేరును జగన్ నాశనం చేశారు.. ఏపీ అభివృద్ధికి టీడీపీనే శరణ్యం.. జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన కామెంట్స్!

నాణ్యమైన స్టీల్ ఇన్‌ఫ్లుయెన్స్ ఫామ్‌వర్క్ సాంకేతికత.. 20 ఏళ్ల గ్యారెంటీ:

కాల్జన్ సంస్థ ఆధ్వర్యంలో ‘స్టీల్ ఇన్‌ఫ్లుయెన్స్ ఫామ్‌వర్క్’ సాంకేతికత, మోనోలిథిక్ కాంక్రీట్ విధానాన్ని ఉపయోగించి ఈ మోడల్ నిర్మాణాన్ని ఎంతో బలంగా చేపట్టారు. ప్రభుత్వం అందించే రూ.5 లక్షల ఆర్థిక సహాయ పరిమితిలోనే ఆధునిక పరిజ్ఞానంతో పూర్తి నాణ్యతతో స్వల్ప వ్యవధిలోనే పనులు పూర్తి చేసి ఇల్లు అప్పగిస్తామని, ఈ తరహా నిర్మాణాలకు 15 నుంచి 20 ఏళ్ల పాటు గ్యారెంటీ ఇస్తున్నామని సదరు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

లబ్ధిదారులకు ఎమ్మెల్యే పిలుపు.. పరిమిత బడ్జెట్‌లో నాణ్యమైన సొంతింటి నిర్మాణం:

లబ్ధిదారులు ఈ మోడల్ ఇంటిని నేరుగా సందర్శించి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలని, ఈ ఆధునిక సాంకేతిక విధానాలను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య పిలుపునిచ్చారు. తక్కువ సమయంలో, అనుకూలమైన బడ్జెట్‌లో నిర్మాణాలు పూర్తి చేసుకోవడం వల్ల పేదలకు ఎంతగానో ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, స్థానిక నాయకులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.