Modi Road Show: హైదరాబాద్లో ప్రధాని మోదీ భారీ రోడ్ షో.. ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి
ఈ రోడ్ షో నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమై కాచీగూడ వరకు సాగుతుంది. గ్రేటర్ పరిధిలోని 25 నియోజకవర్గల నుంచి జనసమికరణ చేశారు.
- tony bekkal
- Published On : November 27, 2023 / 05:54 PM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తలపెట్టిన భారీ రోడ్ షో ప్రారంభమైంది. ఇంతకు ముందు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ భారీ రోడ్ షో చేశారు. అనంతరం ఆ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోదీ ఇలాంటి రోడ్ షోనే నిర్వహించినప్పటికీ ఆ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. కాగా, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రయోగమే చేస్తున్నారు.
ఈ రోడ్ షో నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమై కాచీగూడ వరకు సాగుతుంది. గ్రేటర్ పరిధిలోని 25 నియోజకవర్గల నుంచి జనసమికరణ చేశారు. ఇక మోదీ కాన్వాయ్ వెళ్లే వెంట 25 వేదికలను ఏర్పాటు చేశారు. ఒక్కో వేదికపై ఒక్కొ నియోజకవర్గ అభ్యర్థి ఉండి, మోదీ రోడ్ షోకి తన మద్దతు దారులతో కలిసి స్వాగతం పలుకుతారు. మోదీ ర్యాలీని లైవ్ లో చూసేందుకు కింది వీడియో మీద క్లిక్ చేయండి.
