Municipal Elections: 2 జేబులూ నిండిపోయేంత డబ్బు పంచుతున్నారు.. ప్రతి ఇంటికీ అర తులం బంగారం ఆఫర్
ఓఆర్‌ఆర్ సమీపంలోని మున్సిపాలిటీల్లో ఓటుకు ఏకంగా రూ.10-30 వేల చొప్పున ఇస్తున్నట్లు సమాచారం.
- T Venkateshwarlu
- Published On : February 10, 2026 / 09:32 AM IST
- రేపు మున్సిపల్ ఎన్నికలు
- నిన్న ముగిసిన ప్రచారం
- ప్రలోభాల పర్వం షురూ
Municipal Elections: తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. నిన్న సాయంత్రంతో ప్రచారం ముగియడంతో ఆ తర్వాత ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిని ప్రారంభించారు నేతలు.
పలు ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలకు మించి ఖర్చు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరు పురపాలికల్లో రూ.250 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
చేవెళ్లలో ప్రతి ఇంటికీ అర తులం బంగారం ఆఫర్ ప్రకటించారు. తాను గెలిస్తే అర తులం బంగారం ఇస్తానంటూ 16వ వార్డులో ఓ అభ్యర్థి హామీ ఇచ్చాడు. డబ్బుల పంపిణీ నేడు తారస్థాయికి చేరే అవకాశం ఉంది.
Also Read: Bird Flu Outbreak: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. వేలాది కోళ్లు మృతి.. అధికారుల సూచనలు
పార్టీ ఫండ్‌పై కొందరు అభ్యర్థుల ఆశలు పెట్టుకున్నారు. ఓఆర్‌ఆర్ సమీపంలోని మున్సిపాలిటీల్లో ఓటుకు ఏకంగా రూ.10-30 వేల చొప్పున ఇస్తున్నట్లు సమాచారం. అనేక ప్రాంతాల్లో ఒక్కో ఓటుకు రూ.3-5 వేల వరకు పంచుతున్నారు.
ఇవేగాక చికెన్, మటన్, మందు, చీరలు, వంట సామగ్రి, ఇతర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. పార్టీ ఫండ్ నుంచి కొంత, అభ్యర్థులు సొంతంగా మరికొంత కలిపి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ మునిసిపాలిటీలో ఓ అభ్యర్థి ఏకంగా ఒక్కో ఓటుకు రూ.30 వేలు పంచుతున్నట్లు సమాచారం.
