×
Ad

Chanchalguda 2bHK : చంచల్ గూడ జైలును తరలించాలన్న ఎంపీ అసదుద్దీన్

చంచల్ గూడ జైలును తరలించాలని ఎంపీ అసదుద్దీన్ కోరారు. ఈ జైలును సైబరాబాద్ లేదా రంగారెడ్డి జిల్లాకు తరలించాలని కోరుతున్నట్లు తెలిపారు.

  • Published On : August 28, 2021 / 01:14 PM IST

Asaduddin

MP Asaduddin Owaisi : చంచల్ గూడ జైలును తరలించాలని ఎంపీ అసదుద్దీన్ కోరారు. ఈ జైలును సైబరాబాద్ లేదా రంగారెడ్డి జిల్లాకు తరలించాలని కోరుతున్నట్లు, వరంగల్ జిల్లాలో తరలించిన మాదిరిగా…ఇక్కడ కూడా చేయాలని ఆయన కోరారు. 2021, ఆగస్టు 28వ తేదీ శనివారం చంచల్ గూడలో 288 డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం జరిగింది.

Read More : Chicken shop : స్టీల్ బాక్స్ తెచ్చుకుంటే చికెన్ పై రూ.10 లు తగ్గింపు..

ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసద్ మాట్లాడుతూ…ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాన్ని నిర్మించాలని, ఫారూఖ్ నగర్, జంగంమేట్, బండ్లగూడలో 2bHKను వేగవంతం చేయాలన్నారు. ఇక పాతబస్తీలో నిర్మితమౌతున్న ఫ్లై ఓవర్ల విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి అసద్ తీసుకొచ్చారు.

Read More : Force Gurkha: మహీంద్రా థార్‌కు పోటీగా మార్కెట్లోకి గూర్ఖా

ఇక్కడ జరుగుతున్న పనులు వేగవంతం చేయాలని కోరారు. అలాగే బాపూఘాట్ నుంచి నాగోల్ వరకు మూసీ నది వెంట రోడ్డు నిర్మాణం చేస్తే ఇక్కడి ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కృతజ్ఞతలు తెలిపారు.