New Toll System : నో బూత్.. నో వెయిటింగ్.. సెకన్లలో టోల్ పేమెంట్.. కొత్త విధానం ఇదే.. ఇక జర్నీ మరింత ఫాస్ట్!
New Toll System : టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు. మీ ఫాస్టాగ్ రీఛార్జ్ చేయకున్నా ప్రయాణం ఆగదు. సెకన్లలో టోల్ పేమెంట్ పూర్తి కానుంది. ఈ కొత్త టోల్ విధానమేంటి? ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- September 28, 2026 / 03:51 PM IST
New Toll System
- ఫాస్టాగ్ రీఛార్జ్ మర్చిపోయినా టెన్షన్ లేదు.. టోల్ పేమెంట్ ఇలా
- టోల్ బూత్‌లకు గుడ్‌బై.. ఇక రయ్ రయ్ అంటూ నాన్‌స్టాప్ జర్నీ
- టోల్ ప్లాజాల వద్ద ఇక గ్రీన్ సిగ్నల్.. కొత్త విధానం ఎలా పనిచేస్తుంది
New Toll System : వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇక టోల్ బూత్‌లకు బైబై చెప్పేయండి.. టోల్ ఫీజు కట్టకపోయినా ఇక జర్నీ చేయొచ్చు. ఎక్కడా ఆగాల్సిన పనిలేదు.. ఇకపై సెకన్ల వ్యవధిలోనే టోల్ పేమెంట్ చేసేయొచ్చు. అతి త్వరలో కొత్త టోల్ పేమెంట్ విధానం అమల్లోకి రానుంది. ముఖ్యంగా నేషనల్ హైవేలపై మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ విధానం అందుబాటులోకి వస్తుంది.
ఇతర ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కొత్త టోలింగ్ పేమెంట్ విధానం రాబోతుంది. రాష్ట్రంలో మొత్తం 11 టోల్ ప్లాజాల్లో మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రాసెస్ మొదలైంది. రాబోయే ఆరు నెలల్లో కొత్త టోలింగ్ విధానం పూర్తిగా అందుబాటులోకి రానుంది.
పాత టోల్‌కు బైబై :
టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి బూత్ ఉండదు. ప్రతి లేన్ గ్యాంట్రీలకు RFID రీడర్లు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలు, రాడార్, సెన్సార్లు, లిడార్ వంటి డివైజ్‌లు ఉంటాయి. వెహికల్ గ్యాంట్రీ కింద నుంచి దాటగానే ఫాస్టాగ్, నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేస్తుంది.
ఆపై వెహికల్ వివరాలను డిటెక్ట్ చేస్తుంది. ఆ సమాచారాన్ని నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్‌కు పంపిస్తుంది. టోల్ మొత్తం ఆటోమేటిక్‌గా రన్ అవుతుంది. ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్ కాకున్నా వెహికల్ మాత్రం ముందుకు వెళ్లవచ్చు.
Read Also : Oppo Reno 16t Launch : సూపర్ ఫోన్ బ్రో.. కొత్త ఒప్పో రెనో 16T వచ్చేసింది, ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఫాస్టాగ్ రీఛార్జ్ లేకున్నా :
ఫాస్టాగ్‌లో రీఛార్జ్ చేయకపోయినా ఈజీగా జర్నీ చేయొచ్చు. RFID రీడర్ ఫాస్టాగ్‌ను డిటెక్ట్ చేయకపోయినా హై-రిజల్యూషన్ కెమెరాలు వెహికల్ నంబర్ ప్లేట్‌ను రీడ్ చేస్తాయి. వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా టోల్ పేమెంట్ అవుతుంది.
ఒకవేళ ఫాస్టాగ్ లో బ్యాలెన్స్ ఉంటే వాహనదారుడికి 24 గంటల టైమ్ ఉంటుంది. ఆలోగా ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకుని టోల్ పేమెంట్ చేయొచ్చు. ఆ గడువులోగా పేమెంట్ చేయకపోతే ఈ-నోటీస్ ప్రాసెస్ మొదలవుతుంది.
11 టోల్ ప్లాజాలు :
ఈ కొత్త టోలింగ్ విధానం తెలంగాణ నేషనల్ హైవేలపై అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో మొత్తం 11 టోల్ ప్లాజాలను ఎంపిక చేశారు. కంపెనీల ఎంపిక ప్రాసెస్ తర్వాత మరో ఆరు నెలల్లో కొత్త టోలింగ్ విధానం అమల్లోకి రానుంది.
ఇతర ప్రాంతాల్లో :
ఈ టోలింగ్ విధానాన్ని ముందుగా గుజరాత్‌లోని NH-48పై చోరయాసి టోల్ ప్లాజా వద్ద ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ ఇదే మల్టీ లేన్ టోలింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దేశంలోని నేషనల్ హైవేలపై పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రాంతాల్లో దశలవారీగా టోలింగ్ విధానం అమలు చేయనున్నారు.
