Muthireddy Yadagiri Reddy: ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
సీఎం కేసీఆర్ నామీద నమ్మకంతో భాద్యతలు అప్పజెప్పి నందుకు సంస్థ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెప్పారు.
- Harish Thanniru
- Updated on- October 8, 2023 / 02:33 PM IST
Muthireddy Yadagiri Reddy
Janagama MLA Muthireddy Yadagiri Reddy: టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బస్ భవన్ లో పూజారులు ప్రత్యేక పూజల అనంతరం ముత్తిరెడ్డి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో సంస్థ అగ్రగామిగా ఎదిగిందని అన్నారు.
Read Also : Bigg Boss 7 : బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ స్పెషల్.. సిద్దార్థ్ క్లాస్, రవితేజ మాస్ ఎంట్రీ..
సీఎం కేసీఆర్ నామీద నమ్మకంతో భాద్యతలు అప్పజెప్పి నందుకు సంస్థ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని చెప్పారు. ఉద్యోగులతో కలిసి పని చేస్తా.. సంస్థను నంబర్ వన్ గా నిలుపుతానని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెప్పారు. ఒకప్పుడు ఎక్కడుంది తెలంగాణ అనేవాళ్లకు ఇప్పుడు గ్లోబల్ సిటీగా సీఎం కేసీఆర్ మార్చారని కొనియాడారు. జనగామను మంత్రి కేటీఆర్ డైరెక్షన్లో దేశంలోనే టాప్ 3 మున్సిపాలిటీగా తీర్చిదిద్దానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను నియోజకవర్గాల వారిగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, జనగామ నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఈసారి టికెట్ దక్కలేదు. ఆ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వరరెడ్డిని బరిలోకి దింపేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. టికెట్ దక్కని ముత్తిరెడ్డికి టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. తాజాగా ఆదివారం ఆయన బస్ భవన్ లో ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.
