Student Bites Principal : ఓర్నీ ఇదేం పోయేకాలంరా.. విద్యార్థి టీసీ కోసం వెళితే కోరిక తీర్చాలన్న ప్రిన్సిపల్.. ప్రైవేట్ పార్ట్ కొరకడంతో పరార్..
Student Bites Principal : ఉపాధ్యాయులు విద్యార్థినీల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వార్తలు గతంలో అనేకం వెలుగులోకి వచ్చాయి. కానీ, కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కాలేజీలో ప్రిన్సిపల్ మాత్రం అబ్బాయిలపై కన్నేశాడు.
- Harish Thanniru
- Published on- July 8, 2026 / 11:25 AM IST
Student Bites Principal
Student Bites Principal Kollapur : నాగకర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కాలేజీలో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి పట్ల ప్రిన్సిపల్ లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ప్రతిఘటించిన విద్యార్థి ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్టును కొరికేశాడు. ఆ తరువాత సదరు ప్రిన్సిపల్ ను పట్టుకొని బంధించే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రిన్సిపల్ నగ్నంగానే అక్కడి నుంచి పారిపోయాడు. సదరు ప్రిన్సిపల్ పై విద్యార్థుల స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
ఉపాధ్యాయులు విద్యార్థినీల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వార్తలు గతంలో అనేకం వెలుగులోకి వచ్చాయి. కానీ, కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కాలేజీలో ప్రిన్సిపల్ మాత్రం అబ్బాయిలపై కన్నేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాలమూరు వర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ పీజీ కాలేజీలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న ఓ విద్యార్థి టీసీ కోసం కాలేజీకి వెళ్లాడు. టీసీకోసం వచ్చిన అతనిపై ప్రిన్సిపల్ కొంతకాలంగా అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 10గంటల సమయంలో కాలేజీ ప్రిన్సిపల్ విద్యార్థిని తన గదిలోకి పిలిపించుకున్నాడు. ఆ తరువాత సదరు విద్యార్థిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు.
ప్రిన్సిపల్ తీరును తట్టుకోలేకపోయిన విద్యార్థి కోపంతో అతనిపై దాడికి యత్నించాడు.. అయినా వదిలిపెట్టకపోవటంతో సదరు విద్యార్థి ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్టును కొరికేశాడు. ఆ తరువాత ప్రిన్సిపల్ ను రూంలో పెట్టి బంధించే ప్రయత్నం చేయగా.. అతను తప్పించుకొని బట్టలు లేకుండానే నగ్నంగా అక్కడి నుంచి పరారయ్యాడు. విద్యార్థి వెంటనే అక్కడి నుంచి వెళ్లి తోటి విద్యార్థులకు చెప్పడంతో వారంతా కలిసి ఘటన స్థలికి చేరుకున్నారు. అప్పటికే ప్రిన్సిపల్ పారిపోవడంతో.. విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
తోటి విద్యార్థులతో కలిసి పోలీస్ స్టేషన్ కువెళ్లిన విద్యార్థి.. తనపై ప్రిన్సిపల్ కొద్దిరోజులుగా చేస్తున్న శారీరక, మానసిక వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రిన్సిపాల్ రాకకోసం పీజీ విద్యార్థులు రాత్రంతా పడిగాపులుకాశారు. ప్రిన్సిపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేసి, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
