Bandi Bhagirath: బండి భగీరథ కేసులో ట్విస్ట్.. మెయిల్ అందలేదంటున్న పోలీసులు.. ముమ్మరంగా గాలింపు
బండి భగీరథ కోసం నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. భగీరథ కోసం సైబరాబాద్ ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్లింది.
- Naveen
- Updated on- May 13, 2026 / 10:24 PM IST
Bandi Bhagirath: కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బండి భగీరథ్ పంపిన మెయిల్ తమకు అందలేదని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఈరోజు విచారణకు హాజరుకాకుండా ఎల్లుండి (15న) వస్తానంటూ పోలీసులకు మెయిల్ పంపినట్లు భగీరథ్ చెప్పగా.. పోలీసులు మాత్రం తమకు ఎలాంటి మెయిల్ అందలేని వెల్లడించారు. బండి భగీరథ కోసం మరోసారి నోటీసులు పంపారు పోలీసులు. కరీంనగర్ లో బండి భగీరథ మామకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు బండి భగీరథ కోసం నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. భగీరథ కోసం సైబరాబాద్ ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్లింది. హైదరాబాద్ లో రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
కాగా, పేట్ బషీరాబాద్ పోలీసులకు మెయిల్ పంపినట్లు బండి భగీరథ్ తెలిపాడు. మే 15న విచారణకు హాజరవుతానని మెయిల్‌లో పేర్కొన్నట్లు వివరించాడు. కీలక ఆధారాలతో విచారణకు వస్తానని, సిట్ దర్యాఫ్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశాడు. ఈ-మెయిల్‌తో పాటు అధికారులకు లేఖ కూడా పంపాడని తెలిసింది. వాస్తవానికి ఇవాళ మధ్యాహ్నం పేట్ బషీరాబాద్ పోలీసుల ఎదుట విచారణకు బండి భగీరథ్ హాజరు కావాల్సి ఉంది. కానీ, అతడు విచారణకు రాలేదు.
Also Read: తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే- కొడుకు కేసుపై బండి సంజయ్ ఎమోషనల్
