Family Register Certificate : ఇక ప్రతి కుటుంబానికీ ఒకే గుర్తింపు! తెలంగాణలో ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’కు శ్రీకారం!
Family Register Certificate : ప్రతి కుటుంబానికి ఒకే గుర్తింపు కార్డు ఉండనుంది. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇదేంటి? ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- July 29, 2026 / 08:09 PM IST
Family Register Certificate
- కుటుంబం మొత్తానికి కలిపి ఒకే సర్టిఫికేట్
- త్వరలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ జారీ
- రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా గుర్తింపు
Family Register Certificate : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. ఇకపై ప్రతి ఫ్యామిలీకి ఒక సర్టిఫికెట్ ఉండాల్సిందే.. ఆ కుటుంబంలో ఎంతమంది? ఎవరెవరు ఉంటారు? అనేదానికి సంబంధించి ఒక సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి..
ఇందుకోసమే రాష్ట్రప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.. అదే.. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్.. ఈ విధానంతో (Family Register Certificate) రాష్ట్రంలో కుటుంబ వివరాల నిర్వహణకు ఈజీగా ఉంటుంది. ప్రతి ఇంటి సభ్యుల పూర్తి వివరాలను ఒకేచోట రిజిస్టర్ చేస్తారు.
ఈ డేటా ఆధారంగానే అధికారిక ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. ఈ మేరకు ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్’ ఏర్పాటు దిశగా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త విధానం ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు డిజిటల్ రికార్డులో స్టోర్ అవుతాయి.
అలాగే, కుటంబ సభ్యుల రేషన్‌కార్డు వివరాలను కూడా ఈ రిజిస్టర్‌కు లింక్ చేయనున్నారు. రేషన్‌కార్డు నంబర్‌ను ఫ్యామిలీ ఐడెంటిటీ నెంబర్ గా పరిగణించనున్నారు. ఈ రేషన్ కార్డు ఆధారంగానే ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జారీ చేయడం జరుగుతుంది.
కుటుంబ వివరాలన్నీ ఒకేచోట :
ఫ్యామిలీ రిజిస్టర్‌లో ఫ్యామిలీ పెద్దతో పాటు సభ్యుల పేర్లు, ఎవరికి ఎవరు ఏమౌతారు? వారి రిలేషన్ ఏంటి? వయసు ఎంత? పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, ఇంటి అడ్రస్ వంటి పూర్తి వివరాలను ఇందులో రిజిస్టర్ చేస్తారు. ఈ డేటాతో భవిష్యత్‌లో రాష్ట్రంలో ప్రభుత్వం అందించే పథకాలు, వివిధ సేవల అమలుకు ప్రయోజనకరంగా ఉంటుందని, తద్వారా కుటుంబ వివరాలపై స్పష్టత కూడా ఉంటుందని
రాష్ట్ర సర్కార్ భావిస్తోంది.
ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కోసం ప్రజలు మీ-సేవ కేంద్రాల ద్వారా అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ పేరుతో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. అప్లయ్ చేసిన 2 రోజుల్లోనే సర్టిఫికెట్ జారీ చేసే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు.
ఇకపై మీ సేవ ద్వారా పొందిన ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఒక కుటుంబ వివరాలు అడిగినప్పుడు చూపించుకోవచ్చు. అంటే.. అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. కుటుంబ వివరాలకు ఒకే అధికారిక గుర్తింపు తీసుకురావడమే ఈ కొత్త విధానం లక్ష్యంగా కనిపిస్తోంది.
