Petrol Diesel Shortage : పెట్రోల్, డీజిల్ కొరతకు అసలు కారణం ఇదే.. అందుకే ఈ కష్టాలు..!?

Fuel shortage in Andhra Pradesh: కొందరు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. అయితే, ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కొరతకు ప్రస్తుతం అనేక కారణాలు ఉన్నాయి.

Fuel shortage reasons Petrol Diesel Shortage In Ap And Telangana

Petrol Diesel Shortage : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ చమురు, గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ పెట్రోల్ కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది.

ఏపీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరతతో బంకులు మూతపడ్డాయి. పలు ప్రాంతాల్లోని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నా.. కిలోమీటర్ల కొద్దీ వాహనదారులు బారులు తీరారు.. ఏపీలోనేకాక తెలంగాణ రాష్ట్రంలోనూ పెట్రోల్, డీజిల్ కొరత సమస్య తీవ్రమైంది. హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంకులు మూత పడడంతోపాటు.. మరికొన్ని నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే, ఈస్థాయిలో పెట్రోల్, డీజిల్ కొరతకు కారణాలు ఏమిటి..? కావాలనే పెట్రోల్ బంకుల యాజమానులు కొరతను సృష్టిస్తున్నారా..? అనే అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Also Read :  ఏపీలోని టెన్త్ విద్యార్థులకు బిగ్ అప్డేట్.. ఈ నెలలోనే ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. తేదీ ఇదే..

కొందరు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా లేదని తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ దొరకడం లేదని, రానున్న రోజుల్లో ఈ సమస్య తీవ్రమవుతుందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నేపథ్యంలో వాహనదారులు భారీ సంఖ్యలో పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నారు. దీంతో రెండు రోజుల్లోనే మూడు రెట్లు అమ్మకాలు పెరిగి బంకులు తాత్కాలికంగా ఖాళీ అయ్యాయి. దీని వల్ల పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని చెబుతున్నాయి.

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 29వ తేదీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండో విడత పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు మే4వ తేదీన వెల్లడికానున్నాయి. 29వ తేదీన సాయంత్రం లేదంటే మే నెల మొదటి వారంలో పెట్రోల్ , డీజిల్ ధరలను భారీగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయిందనే వార్తలు వస్తున్నాయి. దీంతో రేట్లు పెరుగుతాయనే ఆశతో కంపెనీలు స్టాక్ మొత్తం పంపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రేట్లు పెరిగాక అమ్ముకోవచ్చనే ఆశతో స్టాక్ దాచిపెడుతున్నారనే అనుమానాలను వాహన దారులు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. కమర్షియల్‌గా డీజిల్‌కొనే కంపెనీలకు స్టాక్ సరిపోకపోవడంతో రిటైల్‌గా పెట్రోల్ పంపుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల రెగ్యులర్ గా వినియోగదారులకు కొరత ఏర్పడుతుందని తెలుస్తోంది. మరోవైపు.. పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందేమోననే ఆందోళనతో జనం అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటం కూడా పెట్రోల్, డీజిల్ కొరతకు కారణమని చెబుతున్నారు. అయితే, పెట్రోల్, డీజిల్ కొరత సమస్యను పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.