AP 10th Results 2026 : ఏపీలోని టెన్త్ విద్యార్థులకు బిగ్ అప్డేట్.. ఈ నెలలోనే ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. తేదీ ఇదే..
AP 10th Results 2026 : ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదలపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఫలితాలు విడుదల తేదీకి సంబంధించి విద్యాశాఖ అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు.
AP 10th Results 2026
- ఏపీలో టెన్త్ ఫలితాలపై కీలక అప్డేట్
- ఈనెల చివరిలోనే ఫలితాలు విడుదలయ్యే అవకాశం
- కసరత్తు పూర్తిచేసిన విద్యాశాఖ అధికారులు
AP 10th Results 2026 : ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదలపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఫలితాలు విడుదల తేదీకి సంబంధించి విద్యాశాఖ అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు మే 4 లేదా 5 తేదీల్లో టెన్త్ ఫలితాలు విడుదల చేస్తారని భావించినప్పటికీ.. కాస్త ముందుగానే ఏప్రిల్ నెలాఖరులో అంటే.. 29 లేదా 30 తేదీల్లో ఫలితాలు విడుదల చేసేందుకు ఏపీ విద్యాశాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెలాఖరులో ఫలితాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : Work from home : వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి.. పెరుగుతున్న డిమాండ్..
ఏపీలో ఇప్పటికే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం టెన్త్ ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఏపీలో టెన్త్ పరీక్షలు జరిగాయి. మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. హాజరు శాతం సుమారు 99.5 శాతంగా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 3415 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈసారి మార్కుల లెక్కింపులో పొరపాట్లు తలెత్తకుండా చూసేందుకుగాను ప్రభుత్వం ట్యాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం జవాబు పత్రాలు మూల్యాంకనం చేశాక.. మార్కులను కౌంట్ చేసి చేతితో నమోదు చేయడంతోపాటు ట్యాబ్‌లలో కూడా వెంటనే అప్లోడ్ చేస్తున్నారు. ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనా, అధికారులు వాటిని త్వరగా పరిష్కరించి ప్రక్రియను ముందుకు కొనసాగించారు. ప్రస్తుతం ప్రశ్నాపత్రాల మూల్యాంకనం, మార్కుల ప్రక్రియ అంతా పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో ఏప్రిల్ నెలలోనే ఫలితాలు విడుల చేసేందుకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BSEAP) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 29 తేదీ 30 తేదీల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని సమాచారం.
విద్యార్థులు తమ ఫలితాలను రోల్ నంబర్, రోల్ కోడ్ నమోదు చేసి https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లో చూడొచ్చు. అదేవిధంగా మన మిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా 9552300009 నంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ చేయడం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. ప్రస్తుతం ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డు తుది కసరత్తు చేస్తోంది.
