×
Ad

phone tapping case : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్.. ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముంది..? సిట్ విచారణ.. వందల కొద్దీ నెంబర్లు

phone tapping case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం నియమించిన

phone tapping case

phone tapping case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం నియమించిన సిట్ బృందం దూకుడు పెంచింది. అయితే, ప్రస్తుతం సిట్ విచారణ పెన్ డ్రైవ్ చుట్టూనే తిరుగుతుండటం ఆసక్తిని రేపుతోంది. ఇంతకీ ఆ పెన్ డ్రైవ్ లో ఏముందనే అంశం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Also Read : Danam Nagender : దానం నాగేందర్ సంచలన కామెంట్స్.. నేను కాంగ్రెస్‌లోనే.. వాళ్ల సంగతి తెలియదు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం..

తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది మంది పోలీసు ఉన్నతాధికారులతో హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిట్ బృందం విచారణను జెట్ స్పీడుతో ప్రారంభించింది. అయితే, ఈ కేసులో ఒక పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. ఈ పెన్ డ్రైవ్ లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లను సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో పెన్ డ్రైవ్ ఆధారంగా ప్రధాన నిందితుడు మాజీ ఎస్‌బీఐ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

ప్రభాకర్ రావు విధుల్లో ఉన్న సమయంలోనే ఈ పెన్ డ్రైవ్ లో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి కీలక సమాచారం స్టోర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ పెన్ డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు నమోదైన ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో రాజకీయ ప్రముఖులతోపాటు.. ప్రముఖ జర్నలిస్టులు, హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి ప్రొఫైల్ వివరాలు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా సిట్ అధికారులు గుర్తించారు. దీంతో మరిన్ని వివరాలు సేకరించేందుకు అధికారులు విచారణను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

సిట్ అధికారులు ఈ పెన్ డ్రైవ్ డేటా‌ను ప్రభాకర్ రావు ముందు‌పెట్టి విచారిస్తున్నట్లు తెలిసింది. ప్రభాకర్ రావు టీమ్ అన్ని ఆధారాలను ధ్వంసం చేసినా.. ఈ పెన్ డ్రైవ్‌ను మాత్రం సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసుప్రూవ్ చేయడానికి ఈ పెన్‌డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్‌గా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఎల్లుండి వరకు ప్రభాకర్ రావు నుంచి పెన్ డ్రైవ్‌కు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.