Pilot Rohit Reddy: చెక్ బౌన్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్.. దోషిగా నిర్ధారించిన కోర్ట్.. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
ప్రాజెక్టుల వివాదాలు, వ్యాపార లావాదేవీల కేసుల వరుసలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి(Pilot Rohit Reddy)కి న్యాయస్థానంలో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.
- V Santhosh Kumar
- Published on- August 8, 2026 / 05:33 PM IST
Pilot rohit reddy convicted in check bounce case court issues nbw
- పైలట్ రోహిత్ రెడ్డి దోషి
- రూ. 34 లక్షల చెక్
- నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
Pilot Rohit Reddy: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ప్రాజెక్టుల వివాదాలు, వ్యాపార లావాదేవీల కేసుల వరుసలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి న్యాయస్థానంలో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా విచారణలో ఉన్న చెక్ బౌన్స్ వ్యవహారంలో నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరించింది. రూ. 34.23 లక్షల విలువైన ఆర్థిక లావాదేవీల వివాదంలో నిందితుడిగా ఉన్న రోహిత్ రెడ్డిని దోషిగా తేలుస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు వెలువడే సమయంలో ఆయన హాజరుకాకపోవడం కేసు పరిణామాలను మరింత ఆసక్తికరంగా మార్చింది.
Amaravathi: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అమరావతిలో మరో రెండు కొత్త ప్రాజెక్టులు.. చంద్రబాబు కీలక ప్రకటన
చెక్ బౌన్స్ కేసులో నేరం రుజువు:
రూ. 34.23 లక్షల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి(Pilot Rohit Reddy) జారీ చేసిన చెక్కు ఖాతాలో సరిపడా నిధులు లేకపోవడం వల్ల బౌన్స్ అయినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ వ్యవహారంలో నిర్దోషిగా నిరూపించుకునేందుకు ఆయన తరఫు న్యాయవాదులు వినిపించిన వాదనలను న్యాయస్థానం పూర్తిగా తిరస్కరించింది. తన నిర్దోషిత్వాన్ని నిరూపించడంలో రోహిత్ రెడ్డి విఫలమయ్యారని స్పష్టం చేస్తూ, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద ఆయనను దోషిగా నిర్ధారిస్తూ తీర్పునిచ్చింది.
నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ:
తీర్పు వెలువరించే కీలక సమయంలో రోహిత్ రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ, తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని లేదా ఆయన స్వయంగా కోర్టు ఎదుట హాజరైన తర్వాతే ఈ కేసులో శిక్ష పరిమాణాన్ని ఖరారు చేస్తామని స్పష్టం చేసింది.
