Modi Telangana Tour : మోదీ తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్.. పలు అభివృద్ధి కార్యక్రమాలు

Modi Telangana Tour : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది.

pm narendra modi visit in telangana on 2026 may 9 lay foundation stone for development programs

  • ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన
  • మే 9న రాష్ట్రానికి మోదీ
  • పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Modi Telangana Tour : ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 2026, మే 9న ఆయన తెలంగాణకు రానున్నారు. ఈ సందర్భంగా మోదీ తెలంగాణాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మోదీ తెలంగాణకు రావడం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ పర్యటనలో భాగంగా మోదీ MMTS ఫేజ్ 2 జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పాటు బీబీ నగర్ AIIMS హాస్పిటల్ జాతికి అంకితం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటితోపాటు తెలంగాణలో పలు జాతీయ రహదారుల శంకుస్థాపన చేస్తారని.. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడంతో పాటు.. పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తారని సమాచారం. అనంతరం జింఖానా గ్రౌండ్స్ లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.

ఇదిలా ఉంటే.. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమానికి మోదీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాని యూనివర్సిటీకి వెళ్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.