×
Ad

IBomma Ravi: బాబోయ్.. ఐదేళ్లలో రూ.100 కోట్ల సంపాదన..! ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు..

50 లక్షల పైచిలుకు వ్యూయర్‌షిప్‌ చూపెట్టి పెద్దఎత్తున్న డబ్బు సంపాదించాడు. భారత్ లో ఉన్న ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌కి నిధుల బదలాయింపు చేశాడు.

IBomma Ravi: పైరసీ పిన్ కింగ్ ఐబొమ్మ రవి కస్టడీలో అతడి నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ రవి ఒక్కడే పైరసీ చేశాడని.. పైరసీ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ తో 100 కోట్ల రూపాయలకుపైగా సంపాదించాడని నిర్ధారించుకున్నారు. ఇందులో ఇప్పటికే రూ. 30 కోట్లకుపైగా  బ్యాంకు లావాదేవీలను సేకరించినట్లు సమాచారం. టెలీగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాలు కొనుగోలు చేశాడని పోలీసులు గుర్తించారు. మూవీపై క్లిక్ చేయగానే 15 యాడ్స్ కు డైరెక్ట్ లింక్ అయ్యేలా వైబ్ సైట్ లో ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రవి 5  రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో సాయంత్రం అతడిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి తిరిగి జైలుకి తరలించారు.

”రవి ఒక్కడే పైరసీ చేశాడు. పైరసీ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో  ఐదేళ్లలో రూ.100 కోట్లకుపైగా సంపాదించాడు. 30కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు సేకరించారు. టెలీగ్రామ్‌ యాప్‌ ద్వారా పైరసీ సినిమాలు కొనుగోలు చేశాడు. బేరమాడి సినిమాలు కొనుగోలు చేశాడు. యూఎస్‌డీ ద్వారా సినిమా అమ్మిన వాళ్లకు చెల్లింపులు చేశాడు. ఐబొమ్మలో సినిమా రిలీజ్‌ చేసి కోట్లు సంపాదించాడు. సినిమా చూడాలంటే తప్పనిసరిగా కాంటాక్ట్‌ యాక్సెస్‌ తీసుకున్నాడు.

సినిమాపై క్లిక్‌ చేయగానే 15 యాడ్స్‌కు డైరెక్ట్‌ లింక్‌ అయ్యేలా ఏర్పాట్లు చేశాడు. మ్యాట్రిమోని, బెట్టింగ్‌, గేమింగ్‌తో పాటు పలు యాడ్స్‌కు లింక్‌ చేశాడు. ఏపీకే ఫైల్స్‌ లింక్స్‌ పంపి బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రమోషన్‌ చేశాడు. 50 లక్షల పైచిలుకు వ్యూయర్‌షిప్‌ చూపెట్టి పెద్దఎత్తున్న డబ్బు సంపాదించాడు. భారత్ లో ఉన్న ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌కి నిధుల బదలాయింపు చేశాడు. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌కి వచ్చిన నిధులను యూఎస్‌డీటీ ద్వారా మళ్లింపు చేశాడు” అని సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు.

Also Read: వామ్మో.. ఇదేం ట్విస్ట్‌రా మామ.. పెళ్లి చేసుకొని బిగ్ షాకిచ్చిన మహిళ.. పేరెంట్స్, బంధువులంతా ఫేకే.. ట్విస్టుల మీద ట్విస్టులు