Hyd Govt Clerk Honey Trap : రేషన్ కార్డు కోసం వచ్చి.. ప్రభుత్వ ఉద్యోగి.. కట్ చేస్తే రూ.6 లక్షలు స్వాహా.. ఏం జరిగిందంటే..

Hyd Govt Clerk Honey Trap : రేషన్ కార్డు కోసం వచ్చిన ఓ మహిళ.. ప్రభుత్వ ఉద్యోగిని హనీ ట్రాప్ చేసి లక్షల్లో వసూలు చేసింది.

Punjagutta police arrest woman who Came for a Ration Card and honey trap Govt Attender

  • పంజాగుట్టలో హనీట్రాప్ కలకలం
  • రేషన్ కార్డు కోసం వచ్చి
  • ప్రభుత్వ ఉద్యోగిపై వలపు వల

Hyd Govt Clerk Honey Trap : ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ యువతీయువకులు ఇతరుల బలహీనతలను ఆసరాగా చేసుకుని.. అమాయకులను చేసి వారిపై వలపు వల విసిరి.. ఆపై బెదిరింపులకు దిగుతూ లక్షల రూపాయలు కాజేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో హనీట్రాప్ వ్యవహారం తెర మీదకు వచ్చింది. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ఓ మహిళ.. అక్కడ పని చేసే ఉద్యోగిపై వలపు వల విసిరింది. అతడితో ఓయో రూములకు వెళ్లి ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకుంది. అలానే ఓయో రూమ్ స్లిప్పులు తన వద్ద పెట్టుకుని సదరు ప్రభుత్వ ఉద్యోగిని డబ్బులు డిమాండ్ చేసింది. అతడు ఇవ్వనంటే తన దగ్గర ఉన్న ఆధారాలను బయటపెడతానంటూ బెదిరింపులకు దిగింది. ఎట్టకేలకు బాధితుడి ఫిర్యాదుతో ఆమెను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.

పంజాగుట్ట ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. రహమత్ నగర్‌కు చెందిన లక్ష్మి (40) అనే మహిళ.. భర్త నుంచి విడిపోయి కొన్నాళ్లుగా విడిగా ఉంటుంది. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం అంటే 2022 జూన్‌లో రేషన్ కార్డు కోసం ఖైరతాబాద్ సివిల్ సప్లై ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకుంది. కార్డు పని మీద ఖైరతాబాద్ ఆఫీసుకు తరచుగా తిరుగుతూ ఉండేది. ఈ క్రమంలో లక్ష్మికి అక్కడ అటెండర్ గా పనిచేస్తున్న సాయికిరణ్ అనే ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వారి మధ్య శారీరక బంధానికి దారి తీసింది. ఆ తర్వాత ఇద్దరూ ఓయో రూమ్స్‌కు వెళ్లడం, ఆమె ఇంటికి అతడు రావడం వంటివి సాగాయి.

*హనీ ట్రాప్‌లో యోగా గురువు.. రూ.56 లక్షలు వసూలు.. మరో 2కోట్లు ఇవ్వాలని డిమాండ్..

ఈ క్రమంలోనే లక్ష్మి… సాయికిరణ్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అతడి వద్ద నుంచి మెల్లగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. ముందు రూ.5 వేలతో మొదలుపెట్టి ఆ తర్వాత లక్షల్లో డిమాండ్ చేయసాగింది. అంతటితో ఆగకుండా.. సాయికిరణ్ మీద మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. తన వద్ద ఫొటోలు, ఓయో రూమ్ రశీదులను పోలీసులకు చూపిస్తానని బెదిరించి అప్పట్లో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. ఇలా ఇప్పటివరకు రూ.6 లక్షల వరకు స్వాహా చేసింది.

*మత్తు మందు ఇచ్చి, వీడియోలు తీసి, రూ.3 కోట్లకు డీల్..! విశాఖ హనీ ట్రాప్ కేసులో మరో సంచలనం..

అయితే సాయికిరణ్ ప్రవర్తనలో వచ్చిన మార్పును పసిగట్టిన అతడి తల్లి.. కొడుకు ప్రవర్తన, ఆఫీస్ వ్యవహారాలపై అనుమానం వచ్చి.. బాధితుడిని గట్టిగా నిలదీయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. లక్ష్మి అతడిని బెదిరించి డబ్బులు గుంజుతున్నట్లు కొడుకు చెప్పడంతో సాయికిరణ్ తల్లి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా, మోసం నిజమేనని తేలింది. దీంతో సోమవారం ఆమెను రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.