Honey Trap: హనీ ట్రాప్‌లో యోగా గురువు.. రూ.56 లక్షలు వసూలు.. మరో 2కోట్లు ఇవ్వాలని డిమాండ్..
అనంతరం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.

Honey Trap: యోగా గురువు రంగారెడ్డి హనీ ట్రాప్ లో చిక్కుకున్నారు. రంగారెడ్డి యోగాశ్రమంలో అనారోగ్యం పేరుతో ఇద్దరు మహిళలు చేరారు. ఆపై ఆయనకు సన్నిహితంగా ఉంటూ ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేశారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి 56 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆపై మరో 2 కోట్లు ఇవ్వాలని గ్యాంగ్ లీడర్ అమర్ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టి ముఠా గుట్టు రట్టు చేశారు. అనంతరం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.
చేవెళ్లకు చెందిన యోగా గురువు రంగారెడ్డి యోగాశ్రమాన్ని నడుపుతున్నారు. అమర్ గ్యాంగ్ రంగారెడ్డిని టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా ఇద్దరు మహిళలను ఆయన ఆశ్రమానికి పంపించారు. అనారోగ్యం పేరుతో వారు ఆశ్రమంలో చేరారు. కొన్ని రోజుల్లోనే వారు యోగా గురువు రంగారెడ్డికి దగ్గరయ్యారు.
ఆయనతో సన్నిహితంగా మెలిగారు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలను తీశారు. వాటిని అడ్డం పెట్టుకుని అమర్ గ్యాంగ్ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది. ముందుగా 56 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. వారి బెదిరింపులతో రంగారెడ్డి భయపడ్డారు. పరువు పోతుందని ఆందోళన చెందారు. వారు అడిగినంత డబ్బు ఇచ్చారు. అయినప్పటికీ అమర్ గ్యాంగ్ బ్లాక్‌మెయిల్ ఆపలేదు. మరో 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వారి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితుడు రంగారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయం వారికి చెప్పారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
యోగా గురువు హనీ ట్రాప్ లో చిక్కుకుని 56 లక్షలు ఇవ్వడం స్థానికంగా సంచలనం రేపింది. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసినా, బెదిరింపులకు పాల్పడినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.