Extramarital Affair: ప్రియుడితో కలిసి రెండేళ్ల కుమార్తెను కొట్టి.. గొంతు నులిమి దారుణం.. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి..

Extramarital Affair: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందన్న కారణంతో రెండేళ్ల కుమార్తెను ప్రియుడితో కలిసి తల్లి హత్య చేసింది.

Extramarital Affair: ప్రియుడితో కలిసి రెండేళ్ల కుమార్తెను కొట్టి.. గొంతు నులిమి దారుణం.. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి..

Extramarital Affair

Updated On : September 14, 2025 / 11:35 AM IST

Extramarital Affair: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందన్న కారణంతో రెండేళ్ల కుమార్తెను ప్రియుడితో కలిసి మహిళ హత్య చేసింది. శనివారం పోలీసులు కుమార్తె తల్లి మమత, ఆమె ప్రియుడు షేక్ ఫయాజ్ ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read: Video: ఇలా ఉన్నారేంట్రా బాబూ.. ఇంటి బాల్కనీలోపలి నుంచి ఫ్లైఓవర్.. రూ.998 కోట్లు ఖర్చు చేసి కట్టారు.. వీడియో

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్‌పల్లికి చెందిన మమత (23)కు సిద్ధిపేట జిల్లా రాయపోలు మండలం వడ్డెపల్లికి చెందిన బంటు భాస్కర్‌తో వివాహం జరిగింది. వీరికి చరణ్ (4), తనూశ్రీ( 2) సంతానం. పెళ్లికి ముందు మమతకు గ్రామానికి చెందిన షేక్ ఫయాజ్(30)తో వివాహేతర సంబంధం ఉంది. అయితే, మమత కొంతకాలం క్రితం ఫయాజ్‌తో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ ఏడాది మేలో తిరిగొచ్చిన మమత.. పిల్లలతో తల్లిగారింటికి వెళ్లిపోయింది.

మే 21న తన కొడుకును తల్లిగారింట్లో ఉంచి.. రెండేళ్ల కుమార్తెను తీసుకొని తన అత్తగారింటికి వెళ్తున్నట్లుగా ఇంట్లో చెప్పింది. మమత తన భర్త వద్దకు వెళ్లకుండా ప్రియుడు ఫయాజ్ తో కలిసి మళ్లీ పరారైంది. అయితే, మమత ఇంటికి రాలేదని అల్లుడు భాస్కర్ చెప్పడంతో మే 27న మమత తండ్రి రాజు శివ్వంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసుకింద నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల దర్యాప్తులో మమత తన ప్రియుడు ఫయాజ్ తోకలిసి గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కనపర్రు వద్ద ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి శుక్రవారం వారిద్దరిని అదుపులోకి తీసుకొని శివ్వంపేటకు తీసుకొచ్చారు. రెండేళ్ల కుమార్తె తనూశ్రీ ఏదని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. జ్వరంతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీసులకు అనుమానం రావడంతో వారిద్దరిని తమదైన శైలిలో విచారించారు. దీంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

మమత, ఫయాజ్ ఇంటి నుంచి పారిపోయిన తరువాత జూన్ 4న బైక్ పై శభాష్‌పల్లికి వెళ్లారు. అక్కడ రెండేళ్ల కుమార్తె తనుశ్రీని కొట్టి, గొంతు నులిమి హత్యచేసి ఆ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, ఏడుస్తూ ఇబ్బంది పెడుతోందని, అందుకే చంపేశామని పోలీసుల విచారణలో నిందితులు చెప్పారు. అదేరోజు రాత్రి అక్కడి నుంచి వెళ్తూ బైకులను చోరీ చేస్తూ.. పెట్రోల్ ఉన్నంత వరకు వెళ్తూ.. అలా నాలుగు బైకులను మార్చేసి కనపర్రుకు వెళ్లారు.

అయితే, మమత, ఫయాజ్ నిజమే చెబుతున్నారా అని తెలుసుకునేందుకు పోలీసులు రెండేళ్ల చిన్నారిని పూడ్చిపెట్టిన ప్రదేశంకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి తవ్వి చూడగా చిన్నారి మృతదేహం బయటపడింది. దీంతో పోలీసులు మమత, ఆమె ప్రియుడు షేక్ ఫయాజ్ లను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.