మత్తు మందు ఇచ్చి, వీడియోలు తీసి, రూ.3 కోట్లకు డీల్..! విశాఖ హనీ ట్రాప్ కేసులో మరో సంచలనం..
విలువైన వస్తువులు తీసుకుని కత్తితో చంపేందుకు యత్నించగా.. బాధితుడు తప్పించుకుని..

Visakha Honey Trap Case : విశాఖ హనీ ట్రాప్ కేసుకు సంబంధించి కిలాడీ జాయ్ జెమీమా ఆగడాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. డబ్బులు ఇవ్వకుంటే హనీ ట్రాప్ బాధితులను చంపడానికి కూడా వెనుకాడని వైనం వెలుగులోకి వచ్చింది. పెద్ద గ్యాంగ్ ను మెయింటేన్ చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త స్కెచ్ లతో అందినకాడికి దోచుకుంటున్నారు. జెమీమా నెట్ వర్క్ ను చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు.
మరోవైపు హనీ ట్రాప్ కేసులో విశాఖలోని పలు పోలీస్ స్టేషన్లకు జెమీమా బాధితులు క్యూ కడుతున్నారు. తాజాగా ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో జెమీమాపై కేసు నమోదైంది. హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడిని ట్రాప్ చేసిన ఈ కిలాడీ రూ.3 కోట్లకు డీల్ సెట్ చేసుకుంది. పలు దఫాలుగా కోటి రూపాయల తన నుంచి వసూలు చేసినట్లుగా బాధితుడు తెలిపారు. ఓ కంపెనీలో పని చేస్తున్న ఆ యువకుడిని సంస్థ యజమాని బంధువుగా, ప్రాజెక్ట్ హెడ్ గా జెమీమా పరిచయం చేసుకుంది. అనంతరం ఓరోజు అతడికి మత్తు స్ప్రే కొట్టింది. అతడు స్పృహ కోల్పోయాక సన్నిహితంగా ఫోటోలు దిగింది.
ఆ తర్వాత కిలాడీ.. ఆ యువకుడిని బ్లాక్ మెయిల్ చేసింది. చివరకు 3 కోట్ల రూపాయలు ఇస్తే వదిలేస్తానంటూ చెప్పడంతో బాధితుడు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కు వెళ్తుండగా.. కారు ఆపి బాధితుడిపై జెమీమా గ్యాంగ్ సభ్యులు దాడి చేశారు. విలువైన వస్తువులు తీసుకుని కత్తితో చంపేందుకు యత్నించగా.. బాధితుడు తప్పించుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. ఎన్ఆర్ఐ యువకుడి ఘటన వెలుగులోకి రావడంతో ఈ బాధితుడు తాజాగా పోలీసులను ఆశ్రయించాడు.
Also Read : వాళ్లు చెబితేనే బాలినేని జనసేనలోకి వెళ్లారా? ఆ భయంతోనే వైసీపీని వీడారా?