Puvvada Ajay Kumar: సీఎం కేసీఆర్‌తో ఎవరైనా పెట్టుకుంటే అంతే..: మంత్రి పువ్వాడ
Puvvada Ajay Kumar: ఖమ్మం జిల్లాలో ఓ నేత చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ స్పందించారు. మంగమ్మ శపథాలు చేస్తున్నారని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : April 16, 2023 / 03:39 PM IST
Puvvada Ajay Kumar
Puvvada Ajay Kumar: సీఎం కేసీఆర్‌తో పెట్టుకున్నవారు శంకరగిరి మాన్యాలు పట్టారని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఇవాళ ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) అభ్యర్థులను గేటు దాటనివ్వనని ఒకరు మంగమ్మ శపథం చేస్తున్నారని, ప్రజలే తమను గెలిపించి అసెంబ్లీకి పంపుతారని చెప్పారు.
“ఖమ్మంలో ఒకాయన మన పార్టీని భూస్థాపితం చేస్తానని మంగమ్మ శపథాలు చేస్తున్నారు. అలాంటి శపథాలు చాలా చూశాం. కేసీఆర్ ముందు ఇలాంటి అనేక మంగమ్మ శపథాలు భూస్థాపితం అయ్యాయి. అసెంబ్లీ గేట్ ను తాకనివ్వను అని శపథాలు చేస్తున్న వారికి చెబుతున్నా.. మీ శపథాలు బూడిదలోపోసిన పన్నీరులా మారుతాయి. ప్రజలు కదా నన్ను అసెంబ్లీకి పంపేది.
ఈ అభివృద్ధిని చూసి కదా ప్రజలు మనలను అసెంబ్లీ కి పంపేది. మనకేదో కడుపు నొప్పి కలిగింది అని బీఆర్ఎస్ పదై విమర్శలు చేయడం సరైనది కాదు. నువ్వు అసెంబ్లీకి పంపేది ఎంటి… ఆ అధికారం ప్రజలకు కదా ఉంది. మన అభివృద్ధిని చూసిన ప్రజలే మనలను అసెంబ్లీ కి పంపిస్తారు.
ప్రజల మనిషి సీఎం కేసీఆర్ ను కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉంది. చీమలపాడు ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతున్నాను. త్వరలోనే రూ.10లక్షలు అందజేస్తాం. తెలంగాణ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు.
Etala Rajender : సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
