Rains in Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్గొండ వరకూ నైరుతు పవనాలు ఉపసంహరించుకుంటుండగా.. వాతావరణంలో మార్పులు సంభవించనున్నాయి. శనివారం ఏర్పడిన అల్పపీడనం ఆదివారానికి ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది.
అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకి పోయే కొలదీ నైరుతి దిశ వైపుగా వంపు తిరిగి కొనసాగుతోంది.
తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి మర్థబన్ గల్ఫ్ నుండి తూర్పు-మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం అనుబంధ ఉపరితల ఆవర్తనం వరకు 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.
…………………………………………….: పవన్ కళ్యాణ్‌పై మంచు విష్ణు ట్వీట్.. నెట్టింట్లో వీడియో వైరల్!
రాగల 3 రోజులకు వాతావరణ సూచన:
తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో, సోమ, మంగళ వారాల్లో ఒకటీ లేదా రెండు చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయి.
వాతావరణ హెచ్చరికలు:
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఆదివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.