అర్థరాత్రి 1గంట వరకు విచారణ..! తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం..
తెలంగాణ హైకోర్టు అరుదైన ఘట్టానికి వేదికైంది. అర్థరాత్రి 1గంట వరకు వెకేషన్ బెంచ్ ప్రొసీడింగ్స్ సాగింది.
- Harishth Thanniru
- Published On : May 25, 2024 / 10:08 AM IST
Telangana high Court
Telangana High Court : తెలంగాణ హైకోర్టు అరుదైన ఘట్టానికి వేదికైంది. అర్థరాత్రి 1గంట వరకు వెకేషన్ బెంచ్ ప్రొసీడింగ్స్ సాగింది. గురువారం ఉదయం 10.30 నుంచి శుక్రవారం తెల్లవారుజామున 1గంట వరకు ఈ విచారణ సాగింది. జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మి నారాయణతో కూడిన డివిజన్ బెంచ్ ఒక్కరోజే లిస్ట్ లో ఉన్న 250 కేసులను విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
Also Read : టీవీ, వాషింగ్ మెషీన్, ఏసీ ధరలు పెరగనున్నాయా? ఎర్ర సముద్రంలో సంక్షోభమే కారణమా..
మే6 నుంచి మే 31వ తేదీవరకు తెలంగాణ హైకోర్టుకు సెలవులు. అత్యవసర కేసుల విచారణకోసం వెకేషన్ బెంచ్ లు పనిచేస్తాయి. సాధారణంగా వెకేషన్ కోర్టులో అత్యవసర పిటీషన్ లు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. గురువారం వెకేషన్ బెంచ్ జాబితాలో కేసులన్నీ పూర్తయ్యే సరికి అర్థరాత్రి ఒంటిగంట దాటింది. బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి క్రిమినల్ కోర్టులో పలు సెక్షన్ల ప్రకారం ప్రైవేట్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిని నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించలేదు. వాయిదా వేసింది. ఈ పిటీషన్ ను అత్యవసరంగా విచారించాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు గురువారం అర్ధరాత్రి 1గంటకు విచారణ చేపట్టింది.
Also Read : మీ పిల్లలు జాగ్రత్త..! తల్లిదండ్రులకు ఎలాన్ మస్క్ హెచ్చరిక..!
అమిత్ షా మార్ఫింగ్ కేసులో కింది కోర్టుకు విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఈ పిటీషన్ పై అర్ధరాత్రి 1గంటలకు విచారించిన హైకోర్టు.. అర్ధరాత్రి ఒంటిగంటకు విచారించాల్సినంత ముఖ్యమైన విషయం కాదని వ్యాఖ్యానించింది. పిటిషన్ పై విచారణను జూన్ 4వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
