Relief For Kcr: కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట.. ఆ కేసులు కొట్టివేత

ట్యాంక్ బండ్ పై 2011 మార్చ్ లో మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా చానళ్ల కెమెరాలను, ఓబీ వ్యాన్లను ధ్వంసం చేశారు ఆందోళనకారులు.

  • Updated on- April 24, 2026 / 06:11 PM IST

Relief For Kcr: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను కొట్టేసింది హైకోర్టు. ట్యాంక్ బండ్ పై 2011 మార్చ్ లో మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా చానళ్ల కెమెరాలను, ఓబీ వ్యాన్లను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను నిందితులుగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో పిటీషనర్లకు ఎలాంటి సంబంధం లేదని వాదనలు వినిపంచారు న్యాయవాది రమణారావు. వాదనలు విన్న అనంతరం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై నమోదైన కేసులను కొట్టేసింది హైకోర్టు.

Also Read: శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం..!