×
Ad

Revanth Government: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి సర్కార్ బిగ్ గుడ్‌న్యూస్..!

ఒక్కోసారి ప్రయాణికులు గంటల పాటు వేచి ఉండాలి వస్తుంది. ఇది ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.

Cm Revanth Reddy (Representative Image (Image Credit To Original Source))

  • వాహనదారులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక..!
  • టోల్ చార్జీలు రద్దు చేసే ఆలోచన
  • కేంద్రం అనుమతి కోరుతూ లేఖ రాయనున్న ప్రభుత్వం

Revanth Government: సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లే వారికి ఇది బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వాహనదారులకు భారీ ఊరట కల్పించే దిశగా తెలంగాణ సర్కార్ ఆలోచన చేస్తోంది. టోల్‌ చార్జీలను ప్రభుత్వమే భరించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. దీని వల్ల వాహనదారులకు ప్రధానంగా రెండు లాభాలు కలుగుతాయి. ఒకటి.. హైవేల ప్రయాణించే వాహనదారులపై ఆర్థిక భారం తగ్గుతుంది. అంతేకాదు టోల్ ప్లాజాల దగ్గర గంటల తరబడి ఏర్పడే ట్రాఫిక్ జామ్‌కు కూడా పరిష్కారం దొరుకుతుంది.

ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తమ సొంతూళ్లకు బయలుదేరుతారు. ఎక్కువ మంది తమ సొంత వాహనాల్లో కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణం అవుతారు. ఈ క్రమంలో హైవేలపై టోల్‌ప్లాజాల దగ్గర ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఒక్కోసారి ప్రయాణికులు గంటల పాటు వేచి ఉండాలి వస్తుంది. ఇది ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా పండుగ రోజుల్లో టోల్ ఫ్రీ సదుపాయం కల్పించాలనే ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Toll Plaza Representative Image (Image Credit To Original Source)

కేంద్రం అనుమతిస్తే వాహనదారులకు పండగే..

అయితే, దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా.. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల టోల్‌ చార్జీలను మేమే భరిస్తాం, అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ లేఖ రాయనుందట. దీనికి కేంద్రం అనుమతిస్తే విజయవాడ, వరంగల్, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ వంటి ప్రధాన రహదారుల్లో ప్రయాణించే వాహనదారులకు బిగ్ రిలీఫ్ లభించనుంది. టోల్ చార్జీల మినహాయింపుతో ప్రయాణం మరింత సాఫీగా, వేగంగా సాగుతుందన్నది అధికారుల భావన.

ఇక ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్..!

”సంక్రాంతి పండగ, మేడారం జాతరల వేళ టోల్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయాలని నిర్ణయించింది. సంక్రాంతి పండగ వేళ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటునకు కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తాం. పండుగ పూట ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఆలోచన” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Also Read: న్యూ ఇయర్ వేళ.. ఈ పనులు చేశారో అంతే సంగతి