Telangana Land Value: తెలంగాణలో భూముల మార్కెట్ విలువ పెంపు.. ఏఏ ప్రాంతంలో ఎంత పెంచారంటే? కొత్త ధరలు రేపటి నుంచే..

Telangana Land Value: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు, అపార్టుమెంట్ల కొత్త మార్కెట్ విలువను పెంపు చేసింది.

Telangana Land Market Values Revision New Prices From June 5

Telangana Land Value: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు, అపార్టుమెంట్ల కొత్త మార్కెట్ విలువను పెంపు చేసింది. భూముల విలువ సవరణ ద్వారా ప్రభుత్వానికి గరిష్ఠంగా సుమారు రూ.1200 కోట్ల వరకు రాబడి పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ప్రభుత్వం ఆమోదించిన భూముల కొత్త విలువల వివరాలను అధికారికంగా గురువారం రిజిస్ట్రేషన్ల శాఖ పోర్టల్‌లో పొందుపర్చనున్నారు. శుక్రవారం నుంచి పెరిగిన మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి.

Also Read – Telangana Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. నేడు తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు.. హెచ్చరికలు జారీ..

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ORR, RRR, కొత్త రహదారులు, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కొత్త ధరలను నిర్ణయించారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో భూముల విలువలు పెరుగుతాయి. స్టాంప్ డ్యూటీ ఛార్జీలు పెరుగుతాయి. రిజిస్ట్రేషన్ ఖర్చులు అధికం అవుతాయి. ప్లాట్లు, అపార్టుమెంట్ల కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది.

ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్ విలువ శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. వ్యవసాయ భూముల కనీస ధరను ఎకరాకు రూ.2.75లక్షలుగా ప్రభుత్వం ఖరారు చేసింది. గ్రేటర్ పరిధిలో ఎకరాకు రూ.15లక్షలుగా నిర్ణయించింది. రాష్ట్రంలో గరిష్ఠంగా ఖాజాగూడలో ఎకరం రూ.30కోట్లుగా పేర్కొంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చ.గజానికి కనీస ధర రూ.600, మున్సిపాలిటీల్లో రూ.1000, కార్పొరేషన్లలో రూ.1500, HMDAలో రూ.2,000గా ఖరారు చేసింది.