Telangana Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. నేడు తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు.. హెచ్చరికలు జారీ..
Telangana Rain Alert : నైరుతి రుతుపవనాలు జూన్3న కేరళను తాకాయి. దీంతో ఆ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రుతుపవనాల వేగం, తీవ్రత కారణంగా పొరుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలోనూ భారీ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
Telangana Rain Alert
- కేరళను తాకిన రుతుపవనాలు
- తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Telangana Rain Alert : నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. దీని ప్రభావంతో కర్ణాటక, తమిళనాడు, ఏపీతోపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మరికొద్దిరోజుల్లో రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వచ్చే మూడు నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read : Rajya Sabha : రాజ్యసభ టికెట్లపై టీడీపీ నేతల్లో టెన్షన్.. చంద్రబాబు చుట్టూ ఆశావాహుల ప్రదక్షిణలు!
నైరుతి రుతుపవనాలు జూన్3న కేరళను తాకాయి. దీంతో ఆ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రుతుపవనాల వేగం, తీవ్రత కారణంగా పొరుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలోనూ భారీ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు.. ప్రస్తుతం అరేబియా సముద్రం, లక్షద్వీప్, బంగాళాఖాతం అంతటా ఈ రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు.
ఇవాళ ఉమ్మండి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వర్షాలు రెండు రోజులు నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షం పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా ఉంటుందని, పలు జిల్లాల్లో 42డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
బుధవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో గురువారం కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు వద్ద ఉండొద్దని, సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని వాతావరణ శాఖ పేర్కొంది.
