Samsung Galaxy S26 Ultra : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ మరి ఇంత తక్కువా.. ఏకంగా రూ. 26,500 తగ్గింపు..!
Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ లవర్స్ డోంట్ మిస్.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్ అసలు ధర రూ. 1,39,999 ఉండగా ఇప్పుడు రూ. 1,17,000కు తగ్గింది. పూర్తి ఆఫర్లు, ధర వివరాలివే..

Samsung Galaxy S26 Ultra : మీరు కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అసలే ఫోన్ల ధరల అమాంతం పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మీకోసం అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. గత ఫిబ్రవరిలో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.

ఈ ఫోన్ ప్రైవసీ డిస్ప్లే, గెలాక్సీ ఏఐ ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. అతి త్వరలో వన్ యూఐ 9 ఫీచర్లు కూడా రానున్నాయి. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ధర పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

అమెజాన్‌లో ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అసలు ధర రూ. 1,39,999 ఉండగా రూ. 23వేలు తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం ఈ శాంసంగ్ ఫోన్ రూ. 1,17,000కే లభిస్తోంది. కొన్ని బ్యాంక్ కార్డులతో రూ. 3,510 వరకు పొందవచ్చు. తద్వారా ధర సుమారు రూ. 1,12,000కు తగ్గుతుంది.

వినియోగదారులు నెలకు రూ. 4,113 నుంచి ఈఎంఐ ఆప్షన్లను పొందవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా పర్ఫార్మెన్స్, వేరియంట్‌పై రూ. 34,100 వరకు వాల్యూను పొందవచ్చు. అదనంగా ఏడాది శాంసంగ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా పొందొచ్చు.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రాలో QHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2ఎక్స్ డిస్ప్లే ఉంది. ఈ స్క్రీన్కు కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ప్రొటెక్షన్ ఉంది. ఇందులో యాంటీ-రిఫ్లెక్టివ్ ప్రైవసీ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఫర్ గెలాక్సీ చిప్సెట్తో రన్ అవుతుంది.

12GB, 16GB ర్యామ్‌తో పాటు 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్లతో వస్తుంది. వన్ యూఐ 8.5తో ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. 7 ఏళ్ల సాఫ్ట్వేర్, సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 60W వైర్డ్ 25W వైర్లెస్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ, ఎస్ పెన్, IP68 రేటింగ్ అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్లో క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. 30fps వద్ద 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
